‘పుష్ప’ డబ్బింగ్ షురూ.. బన్నీ పిక్ వైరల్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతోన్న పుష్పపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈక్రమంలో బన్నీ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ప నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోందన్న సంగతిని ఇది వరకే ప్రకటించారు. పుష్ప రాజ్‌ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు అన్ని రకాలుగా సిద్దమయ్యారు. ఈ మేరకు తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.
నిన్నటి వరకు మాల్దీవుల్లో రచ్చ చేసిన బన్నీ తాజాగా హైద్రాబాద్‌లో ప్రత్యక్షమయ్యాడు. అది కూడా పుష్ప పనుల కోసమే. పుష్ప మూవీ నుంచి బన్నీ బర్త్ డే సందర్బంగా ఓ టీజర్ రాబోతోన్న విషయం తెలిసిందే. ఈమేరకు వదిలిన ప్రీ ల్యూడ్ ఆఫ్ పుష్ప అనే చిన్న వీడియో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా పుష్ప యూనిట్ మరో అప్డేట్ ఇచ్చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేసింది.

పుష్ప డబ్బింగ్ పనులు మొదలెట్టేశామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు అందరూ కలిసి డబ్బింగ్ పనులకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో బన్నీ, సుకుమార్, నిర్మాతలు అందరూ కూడా దైవాన్ని ప్రార్థించి కొబ్బరి కాయలు కొట్టేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పుష్ప రాజ్‌ను కలుసుకునేందుకు రేపు సాయంత్రం ఆరు గంటల 12 నిమిషాలకు రెడీగా ఉండండి అని మైత్రీ మూవీస్ తెలిపింది.


Click it and Unblock the Notifications











