పుష్పకు తెలంగాణలో మరో బంపర్ ఆఫర్.. రోజుకు ఎన్ని షోలంటే?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని అల్లు అర్జున్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. రెగ్యులర్ గా అన్ని భాషల్లో కూడా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. అయితే ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి ఒక బంపర్ ఆఫర్ ఐతే వచ్చింది. పెద్ద సినిమా కాబట్టి ఒకే రోజు 5 షోలను కూడా ప్రదర్శించుకునే ఛాన్స్ వచ్చింది.

ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద వీలైనంత త్వరగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ అయితే రాలేదు. టికెట్ల విషయంలో అలాగే బెన్ఫిట్ షోల విషయంలో కూడా అక్కడి నుంచి ఎలాంటి వార్తలు రాలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం పుష్ప యూనియ్ కు అయితే గుడ్ న్యూస్ వచ్చింది. ఉదయం 7 గంటల షోలను ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి రోజు ఒక సింగిల్ థియేటర్లో 5 వరకు ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది.

Allu arjun Pushpa movie daily 5 shows in telangana

మరి ఈ అవకాశంతో సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించగా రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన రిజల్ట్ పై దర్శకుడు సుకుమార్ కూడా చాలా నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాకుండా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయ్యారు అంటే ఫైనల్ అవుట్ పుట్ కోసం ఏ స్థాయిలో కష్టపడుతున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అల్లు అర్జున్ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ కూడా మిగతా భాషల్లో ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.

మిగతా భాషల్లో కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యేలా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 180 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇండియాలో 140 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అయితే ఓవర్సీస్ లో స్పైడర్ మాన్ మూవీ నుంచి కొంత పోటీ అయితే ఎదురు కానుంది. అక్కడ అమెరికాలో ఆ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటంతో పుష్ప సినిమాకు కొత్త కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లు కూడా ఎప్పటిలానే తక్కువగా ఉన్నాయి. అలాగే కర్ణాటకలో కూడా తెలుగు భాషలో ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు అనే విమర్శలు ఎదురవుతున్నాయి. అక్కడ లోకల్ కన్నడ భాషలో ఎక్కువ స్క్రీన్స్ లలో సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడం లేదు అని ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X