Pushpa Pre Release: ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న పుష్ప రాజ్.. స్పెషల్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత పెద్ద సినిమాల హడావుడి కనిపిస్తోంది. ఇక పాన్ ఇండియా సినిమాల హడావుడి కూడా అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుష్ప సినిమా పై ప్రస్తుతం అంచనాకు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా పాన్ ఇండియా అంచనాలకు తగ్గట్టుగానే తెరపైకి రానుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ పై గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ కు చిత్ర యూనిట్ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేసింది. అఫీషియల్ పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగానే..
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. గత ఏడాది నుంచి ఎంతగానో ఊరిస్తున్న పుష్ప రాజ్ ఈ ఏడాది డిసెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా 5 భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. దర్శకుడు సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగానే సినిమాను రూపొందించినట్లు ఇప్పటికే ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది.

న్యూ రికార్డ్స్..
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇదివరకే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమా అన్ని భాషల్లోనూ వర్కౌట్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా గట్టిగానే వస్తున్నాయి. తెలుగులో అయితే తప్పకుండా ఈ సినిమా సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తుందని అర్థమవుతుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్..డేట్ ఫిక్స్
ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించాలని గత నెల నుంచి ఈ చిత్ర యూనిట్ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తానికి ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లోని వేదికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. యూసుఫ్ గుడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదక చేశారు.

రాబోయే గెస్ట్ ఎవరు?
అల్లు అర్జున్ ప్రత్యేకమైన పోస్టర్ విడుదల చేస్తూ రిలీజ్ పార్టీకి సిద్ధమవ్వాలి అని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎవరు వస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొదట బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ప్రత్యేక అతిథిగా వచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని మరి కొన్ని వార్తలు కూడా వచ్చాయి.
Recommended Video

మెగా హీరో వస్తాడా?
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో కొత్త టాక్ ఏమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈనెల 12వ తేదీన నిర్వహించబోయే ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఫోకస్ పెట్టిన చిత్ర యూనిట్ బాలీవుడ్ తమిళ్ ఇండస్ట్రీలో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా ప్రమోషన్ చేయాలని చూస్తోంది. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











