Pushpa Trailer: మాస్ ఫెస్టివెల్‌కు డేట్ ఫిక్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు ఆ తరహా చిత్రాలు చేసి సత్తాను నిరూపించుకున్నారు. అదే దారిలో మరికొందరు రెడీ అవుతున్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. ఆ ఉత్సాహంతోనే వెంటనే 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాను ప్రారంభించాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ స్థాయిలో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు అదే రీతిలో ఉన్న విషయం తెలిసిందే.
బన్నీ, సుకుమార్ కలయికలో గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతుంది. దీంతో దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ భాగానికి సంబంధించిన దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే రెండో పార్ట్ కోసం చిత్రీకరణ మెదలు పెట్టి మరింత వేగంగా షూట్ జరుపుతున్నారు.
'పుష్ప.. ద రైజ్'ను డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఎప్పుడో ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే చాలా రోజుల క్రితం టీజర్‌ను విడుదల చేశారు. ఇది ఆల్‌టైం రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే, ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన వీడియోలు, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇటీవలే విడుదలైన 'దాక్కో దాక్కో మేక', 'శ్రీ వల్లీ' సాంగ్స్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అదే సమయంలో అంచనాలు కూడా ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప.. ద రైజ్' విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేయాలని భావించింది. ఈ నేపథ్యంలో తాజాగా దాన్ని విడుదల చేయబోతున్న తేదీని ప్రకటించారు. ఇక, ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 6వ తేదీని రిలీజ్ చేయబోతున్నారు. దీన్ని వెల్లడించిన చిత్ర యూనిట్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో అతడు తగ్గేదేలే అన్నట్లుగా పవర్‌ఫుల్ ఫోజుతో కనిపించాడు. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్ ఇందులో కీలక పాత్రలను పోషిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











