Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పుష్ప విలన్ గోల.. అప్పటి వరకు ఆ టెన్షన్ వద్దంటున్న సుకుమార్
పెద్ద సినిమాకు సంబంధించిన చిన్న పాయింట్ లీక్ అయినా కూడా సోషల్ మీడియాలో దాని చుట్టూ అల్లుకునే రూమర్స్ అన్ని ఇన్ని కావు. క్లారిటీ వచ్చినా కూడా కొన్నిసార్లు ఆ రూమర్స్ డోస్ తగ్గవు. అందుకే చాలా మంది వాటిని పట్టించుకోరు. ఇక దర్శకుడు సుకుమార్ ఇటీవల పుష్ప సినిమా విషయంలో వస్తున్న రూమర్స్ గురించి పెద్దగా ఆలోచించలేదట. ముందు జరగాల్సిన పని జరగాలని ఆ తరువాత మిగతా టెన్షన్స్ గురించి ఆలోచిద్దామని చిత్ర యూనిట్ తో చర్చించినట్లు సమాచారం.
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తుండడంతో బాలీవుడ్ లో కూడా సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందని టాక్ వస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన చాలా విషయాలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వకపోయినా కూడా ముందుగానే లీక్ అయ్యాయి. ఇక సినిమాలో విలన్ గా కనిపించబోయేది ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది.
మొదట విజయ్ సేతుపతిని అనుకోగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఆ విషయంపై పుష్ప టీమ్ కంటే ముందే సేతుపతి వివరణ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఇతర కోలీవుడ్ హీరోలతో పాటు మొత్తం 9 మంది స్టార్స్ విలన్స్ గా బన్నీకి పోటీగా నిలవనున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ పై సుక్కుకు తెలిసిన సైలెంట్ గానే ఉంటున్నాడు. ముందు అనుకున్న షెడ్యూల్ ని పూర్తి చేసి మిగతా విషయల తరువాత గురించి ఆలోచించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడైతే విలన్ అవసరం లేకుండానే షెడ్యూల్ ని ఫినిష్ చేయవచ్చట. కానీ నెక్స్ట్ షెడ్యూల్ లో మాత్రం ఎవరో ఒకరిని దింపడం కాయమని తెలుస్తోంది.