‘పుష్ప’ మూవీ షూటింగ్ అప్‌డేట్: అవి కూడా జరిగిపోతే ఫస్ట్ పార్ట్ పూర్తయినట్లే

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'పుష్ప'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఇది రూపొందుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎన్నో జాగ్రత్తల నడుమ తీస్తున్నారు. ఇక, ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని ఇటీవలే నిర్మాత వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది.

తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప' మూవీ మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ దాదాపు 80 శాతం వరకూ పూర్తయిందట. మరో 25 రోజుల షూటింగ్ జరిగితే మిగిలిన భాగం కూడా కంప్లీట్ అవుతుందని అంటున్నారు. మిగిలిన భాగంలో మూడు పాటలు (అందులో ఒక ఐటమ్ సాంగ్).. క్లైమాక్స్ సీన్, ప్రీ క్లైమాక్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రకరించాల్సి ఉందని అంటున్నారు. ఈ 25 రోజుల షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది.

Allu Arjun Pushpa Shooting 25 Days Balance

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం డీ గ్లామర్ లుక్‌తో కనిపిస్తోన్న అతడు.. చిత్తూర్ యాసతో డైలాగులు పలకబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా చేస్తుండగా.. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇక, దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X