‘పుష్ప’కు దూరంగా అల్లు అర్జున్: యాంకర్ అనసూయ పోస్టుతో క్లారిటీ

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. బడా నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. అద్భుతమైన టాలెంట్‌తో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గత ఏడాది 'అల.. వైకుంఠపురములో'తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. ప్రస్తుతం 'పుష్ప' అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘పుష్ప’గా రాబోతున్న అల్లు అర్జున్

‘పుష్ప’గా రాబోతున్న అల్లు అర్జున్

'ఆర్య', 'ఆర్య2' వంటి చిత్రాల తర్వాత క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌తో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

‘ఐకాన్ స్టార్’ అయ్యేందుకు సాహసం

‘ఐకాన్ స్టార్’ అయ్యేందుకు సాహసం

'పుష్ప' మూవీ గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారుతున్నాడు. అందుకే దీని కోసం అతడు ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మూవీ కోసమే లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే, చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. డీ గ్లామర్‌గా ఉండే ఈ రోల్ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు కూడా.

‘పుష్ప’ ఒక్కడు కాదు... ఇద్దరంటూ

‘పుష్ప’ ఒక్కడు కాదు... ఇద్దరంటూ

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప'లో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, అదే సినిమాలో మెయిన్ ట్విస్ట్ అని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం గతంలో విడుదల చేసిన పోస్టర్‌లో బన్నీ కాలికి ఆరు వేళ్లు కనిపించాయి. అయితే, ఇటీవల వచ్చిన రిలీజ్ పోస్టర్‌లో మాత్రం ఐదు వేళ్లే ఉన్నాయి. దీంతో ఇందులో ఇద్దరు హీరోలు ఉన్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.

బన్నీ బర్త్‌డే కానుక అదిరిపోయింది

బన్నీ బర్త్‌డే కానుక అదిరిపోయింది

అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుని ఏప్రిల్ 7న 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన ఏకైక టీజర్‌గా ఈ వీడియో నిలిచింది.

సినిమా నుంచి తప్పుకున్న బన్నీ

సినిమా నుంచి తప్పుకున్న బన్నీ

కరోనా ప్రభావంతో సినిమా షూటింగులు నిలిచిపోతున్నాయి. అయినప్పటికీ 'పుష్ప' చిత్రీకరణ మాత్రం నిరంతరంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్‌ నుంచి అల్లు అర్జున్ తప్పుకున్నాడట. దీంతో విలన్‌గా చేస్తున్న మరో హీరో ఫహద్ ఫాసిల్‌పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు సుకుమార్. ఈ మేరకు అతడికి స్వాగతం చెబుతూ ట్వీట్ కూడా చేశారు.

Recommended Video

Mahesh Babu Sets New Record | Sarileru Neekevvaru
మరో హీరోతో షూట్.. అనసూయతో

మరో హీరోతో షూట్.. అనసూయతో

వాస్తవానికి 'పుష్ప' మూవీ షూటింగ్ కూడా నిలిచిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, యాంకర్ అనసూయ ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న పిక్‌ను పోస్ట్ చేయడంతో.. చిత్రీకరణ జరుగుతోన్న విషయం బయటకు వచ్చింది. అన్నట్లు ఇందులో ఆమె కూడా కీలక పాత్రను పోషిస్తోంది. అందుకే ఈ పోస్ట్ పెట్టింది. మొత్తానికి 'పుష్ప' షూటింగ్ మాత్రం జోరుగానే సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X