Pushpa Top 5 points: పుష్పను ఎందుకు చూడాలంటే.. ఆసక్తి రేపుతున్న ఐదు అంశాలు!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా మూడు వేలకు పైగా థియేటర్స్ లో విడుదల అవుతోంది. ఇక దాదాపు 144కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అయితే ఒక సినిమాకు వెళ్లేముందు ప్రతి ప్రేక్షకుడిని ఏదో ఒక అంశం ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తుంది. ఇక పుష్ప సినిమా ఇన్ సైడ్ టాక్ ఎలా ఉన్నా కూడా పుష్పలో ఒక ఐదు హైలెట్ పాయింట్స్ కోసమైనా సినిమాని చూడాల్సిందే.

స్క్రీన్ ప్లేతో మ్యాజిక్

స్క్రీన్ ప్లేతో మ్యాజిక్

డైరెక్టర్ సుకుమార్ అంటే ఓ వర్గం ప్రేక్షకులకు అమితమైన ఆసక్తి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన ఎలాంటి సినిమాలు చేసినా కూడా తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ క్రియేట్ చేయకుండా ఉండలేరు. ఇక ఈసారి పుష్ప సినిమాలో ఫుల్ ఊర మాస్ కమర్షియల్ అంశాలను జోడిస్తూ తనదైన శైలిలో స్క్రీన్ ప్లేను రచించాడట. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కూడా ఒక్కసారిగా ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాయని తెలుస్తోంది.

పుష్ప రాజ్ పవర్ఫుల్ రోల్

పుష్ప రాజ్ పవర్ఫుల్ రోల్

ఇక అన్నిటికంటే ఎక్కువగా అల్లు అర్జున్ పాత్ర ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బన్నీ పుష్ప రాజ్ కోసం చాలా కష్టపడినట్లు అర్ధమవుతోంది. పుష్ప రాజ్ బాడీ లాంగ్వేజ్ తో పాటు డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉంది కాబట్టి తప్పకుండా అతని పాత్ర సినిమాకి హైలెట్ పాయింట్ అని చెప్పవచ్చు.

 ఎర్రచందనం స్మగ్లింగ్..

ఎర్రచందనం స్మగ్లింగ్..

ఇక సినిమా కథ మొత్తం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తేరకెక్కినట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఇక దర్శకుడు ఒకప్పుడు జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ స్మగ్లింగ్ దందా గురించి తనదైన శైలిలో ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. అడవులలో స్మగ్లర్లు వారి వెనకాల ఉండే బాస్ లు పాలిటిక్స్ ఇలా అన్ని కోణాల్లో టచ్ చేసినట్లు సమాచారం.

దేవి మ్యూజిక్.. సమంత స్పెషల్ సాంగ్

దేవి మ్యూజిక్.. సమంత స్పెషల్ సాంగ్

సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం మెజర్ ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా సమంత ఐటెమ్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో 40మిలియన్ వ్యూవ్స్ అందుకొని సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో మరో లెవెల్లో ఉంటుందట. ఇక ఐటెమ్ సాంగ్ లో సుమంత గ్లామర్ తో హాట్ స్టెప్పులు కూడా కనువిందు చేస్తాయని తెలుస్తోంది.

యాక్షన్ ఎపిసోడ్

యాక్షన్ ఎపిసోడ్

ఇక అన్నిటికంటే ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ప్రధానం అని తెలుస్తోంది. పుష్ప సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసమే భారీగా ఖర్చు చేసినట్లు అర్ధమవుతోంది. టీజర్ ట్రైలర్ లలో చూపించిన కొన్ని షాట్స్ కూడా అమేజింగ్ అనిపిస్తున్నాయి. ఇక తప్పకుండా యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఒక విజువల్ ట్రీట్ అందిస్తుందని చెప్పవచ్చు. ఇక సినిమాను ఈ టాప్ 5 పాయింట్స్ తో పాటు మరికొన్ని అంశాలల్లో కూడా ప్రేక్షకులు మెచ్చే అవకాశం ఉంది. మరి ప్రస్తుత వాతావరణంలో పుష్ప ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X