Pushpa 2 : ఆ ఫేమస్ టీవీలో అల్లు అర్జున్ 'పుష్ప 2' టెలికాస్ట్... ఫైనల్‌గా మేకర్స్‌కు తప్పిన టెన్షన్!

దేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. 2021లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా టీవీ పార్టనర్ ఫిక్స్ అయింది. దానితో పాటు.. పుష్ప 2 మేకర్స్ కు పెద్ద టెన్షన్ తప్పింది. అసలు మేకర్స్ కు తప్పిన టెన్షన్ ఏంటి.. ఏ టీవీలో ఈ సినిమా టెలికాస్ట్ కానుందనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమా పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. పుష్ప సినిమా 2021 డిసెంబర్ చివరిలో వచ్చి ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ ను గ్లోబల్ స్టార్ ను చేసింది. ఇక రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా మారిపోయింది.

Allu Arjun, Rashmika Pushpa 2 Movie Telecast on Star Maa and Finally Makers Lost a Big Tension Details Here

ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్తుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం కోసం.. దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ సినిమాలో ఫాహద్ ఫజిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి కీలక అప్డేట్స్ వచ్చాయి.

పుష్ప 2 సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఛానెల్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ అయితే పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతుందని సమాచారం.

Allu Arjun, Rashmika Pushpa 2 Movie Telecast on Star Maa and Finally Makers Lost a Big Tension Details Here

పుష్ప 2 మేకర్స్ కు భారీ టెన్షన్ తప్పింది. గత కొన్ని నెలల కితం ఈ సినిమా కీలక పాత్రదారుడు యంగ్ నటుడు జగదీష్ బండారి ఓ కేసు విషయంలో జైలుకి వెళ్లిన విషయం తెలిసిందే. పుష్ప 1 లో అల్లు అర్జున్ పాత్రతో చివరి వరకు ట్రావెల్ అయ్యే కేశవ పాత్రలో తాను అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. మరి అతను ఆకస్మికంగా కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్లడం చిత్ర యూనిట్ కి ఒక ఊహించని షాక్ ఏర్పడింది.

పార్ట్ 2 లో కూడా కీలక పాత్ర జగదీష్ చేస్తుండగా తాను ఇప్పుడు అందుబాటులో లేకపోవడం ఒకింత అందరిలో టెన్షన్ కలిగించింది. అయితే ఇప్పుడు ఫైనల్ గా వారికి ఓ టెన్షన్ తప్పిందని తెలుస్తోంది. ఈ యంగ్ నటుడు బెయిల్ మీద బయటకి వచ్చాడని సమచాారం. దీంతో షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు.. దీనితో పుష్ప 2 యూనిట్ మిగతా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X