నా జీవితంలో మరచిపోలేని సమయం ఇది.. అల్లు అర్జున్ భావోద్వేగం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 'అల.. వైకుంఠపురములో' విజయం ఆయనలో సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఈ సక్సెస్ పట్ల అల్లు ఫ్యామిలీ అంతా ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ మేరకు తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్ చెబుతూ భావోద్వేగపూరితంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్. వివరాల్లోకి పోతే..

సంక్రాంతి కానుక.. ఆట ఆటకు రికార్డుల వేట
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని ఈ ఏడాదికి కిక్ స్టార్ట్ ఇచ్చింది. ఆట ఆటకు రికార్డుల వేట అన్నట్లుగా పలు రికార్డులు తిరగారాసింది.

50 రోజుల 'అల.. వైకుంఠపురములో'
'అల.. వైకుంఠపురములో' విజయవంతమైన యాత్రలో సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తయ్యాయి. ఈ 50 రోజుల యాత్రలో థియేటర్స్ అన్నీ అల్లు అర్జున్ హంగామాతో కళకళలాడాయి. మరోవైపు భారీ రేంజ్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతల్లో సంబరాలు నింపింది 'అల.. వైకుంఠపురములో' మూవీ.

ఫ్యామిలీ ఆడియన్స్ నీరాజనాలు.. కలెక్షన్ల సునామీ
గత జ్ఞాపకాలన్నీ మరిపించేలా 'అల.. వైకుంఠపురములో' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన అల్లు అర్జున్.. ఈ 50 రోజుల్లో సుమారు 170 కోట్ల రూపాయలు కొల్లగొట్టి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు నీరాజనాలు పలికారు.

నా జీవితంలో మరచిపోలేని సమయం ఇది
అయితే ఈ రేంజ్ సక్సెస్ చూసి ఒకింత భావోద్వేగానికి గురవుతూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ''అల.. వైకుంఠపురములో సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. మీ ఆశీస్సులన్నిటికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా జీవితంలోనే మరచిపోలేని సమయం ఇది. మీ ప్రేమకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే'' అని పేర్కొన్నారు బన్నీ.
Recommended Video

‘అల వైకుంఠపురములో' మూవీ
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించగా ఆయన సరసన పూజా హెగ్డే ఆడిపాడింది. సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ, జయరాం, సచిన్, టబు కీలకపాత్రల్లో నటించి భేష్ అనిపించుకున్నారు.


Click it and Unblock the Notifications











