twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం.. హృదయం ముక్కలైంది.. బన్నీ, మంచు లక్ష్మీ రియాక్షన్

    |

    ఇండియన్ డైరెక్టర్ శంకర్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం భారతీయుడు 2. ఇది అప్పట్లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తానా అనుకున్నారో గానీ అడుగడుగునా ఆటంకాలే ఏర్పడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరగడంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది.

    యాక్షన్ సీక్వెన్స్..

    యాక్షన్ సీక్వెన్స్..

    ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతోంది. ఈ మేరకు లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో సెట్ డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి కింద పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

    ముగ్గురి దుర్మరణం..

    ఈ ఘటనలో ముగ్గురి దుర్మరణం చెందినట్టు నిర్మాణ సంస్థ అయిన లైకా అధికారికంగా ప్రకటించింది. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

    వార్త వినగానే..

    ‘భారతీయుడు 2 సినిమా సెట్లో జరిగిన ప్రమాదం గురించి ఇప్పుడే తెలిసింది.. హృదయాన్ని కలిచివేసింది.. గుండె పగిలేలాంటి దుర్ఘటన.. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా'నంటూ ట్వీట్ చేశాడు.

     చాలా బాధగా ఉంది..

    చాలా బాధగా ఉంది..

    ఇండియన్ 2 సెట్‌లో జరిగిన ప్రమాదంపై మంచు లక్ష్మీ స్పందిస్తూ.. చనిపోయిన వారి కుటుంబాల గురించే నా హృదయం పరితపిస్తోందని తెలిపింది. ఇది చాలా బాధను కలిగించే దుర్ఘటన. గాయాలు తగిలిన వారు త్వరగా కోలుకోవాలి, మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాల'ని ట్వీట్ చేసింది.

    English summary
    Allu Arjun Reaction On Major Accident At Indian 2 Sets. Just heard the shocking news . Dreadful & Heart breaking news . Condolences to the Family members & dear ones .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X