Allu Arjun గురించి చిరంజీవి ట్వీట్.. బన్నీ రియాక్షన్.. చికాబాబీ అంటే తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు. కొంతకాలం రాజకీయాలతో సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తనదైన మ్యానరిజంతో అలరిస్తున్నారు. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ సమస్యల పరిష్కారం, నటీనటుల ఆర్థిక, ఆరోగ్య అవసారలకు సాయం అందిస్తూ నిజమైన మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. ఇక తన కుటుంబంలోని వారితో చిరుకు ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు ఉదాహరణగా ఆయన లేటెస్ట్ ట్వీట్ చెబుతోంది.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. అయితే గంగోత్రి కంటే ముందుగానే మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. గంగోత్రి తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య మూవీతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.

అదిరిపోయే డ్యాన్సులు, అంతకుమించిన ఫైట్స్ తో తన మార్క్ చూపించాడు బన్నీ. ఇక పుష్ప మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 సంవత్సరాలు అవుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక పంచుకున్న బన్నీ అందరి ప్రేమ, అభిమానంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపాడు. అయితే తాజాగా అల్లు అర్జున్ కి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
"ప్రియమైన బన్నీ హృదయపూర్వక శుభకాంక్షలు. ఈ 20 ఏళ్లలో ఎన్నో మంచి సినిమాలు చేశావ్. చాలా సంతోషంగా ఉంది. నీ చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి. అప్పుడే ఇన్నేళ్లు అయ్యాయా అనిపిస్తోంది. ప్రేక్షకుల మదిలో సముచిత స్థానాన్ని పొంది పాన్ ఇండియా స్టార్ గా, ఐకాన్ స్టార్ గా ఎదిగావ్. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మరెన్నో హృదయాలను గెల్చుకోవాలని కోరుకుంటున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు.
చిరంజీవి ట్వీట్ పై అల్లు అర్జున్ స్పందించారు. "మీ అద్భుతమైన ఆశీర్వాదం, శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు. నా హృదయంలో ఎప్పటికీ మీపై కృతజ్ఞతా భావం కలిగి ఉంటుంది. థ్యాంక్యూ చికాబాబీ" అని బన్నీ రీట్వీట్ చేశాడు. అయితే బన్నీకి మెగాస్టార్ చిరంజీవి మావయ్య అయినప్పటికీ చికాబాబీ అని పిలుస్తారు. దానికి అర్థం మాత్రం తెలీదు.


Click it and Unblock the Notifications











