Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘96’ను బన్నీకి చూపించిన దిల్ రాజు.. స్టైలీష్ స్టార్ రియాక్షన్ ఏంటంటే..?
తమిళ నాట సంచలనాలు నమోదు చేసిన చిత్రం 96. త్రిష, విజయ సేతుపతి జంటగా నటించిన ఈ మూవీ ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. ఈవెంట్ ఏదైనా సరే..ఈ సినిమాకు అవార్డులు రావాల్సిందే. ఉత్తమ నటిగా త్రిష ఆ అవార్డులన్నింటిని ఎత్తుకెల్లాల్సిందే. ఆ రేంజ్లో మ్యాజిక్ క్రియేట్ చేశారు కాబట్టే.. మన వాళ్లు రీమేక్‌పై కన్నేశారు. ఓ సినిమాను రీమేక్ చేయాలంటే గట్స్ కావాలి. అందులోనూ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్‌ను చేయడం మామూలు విషయం కాదు.
రీమేక్ చేయకూడదన్న సమంత..
96 సినిమాను చూసిన సమంత.. అప్పట్లో మాట్లాడుతూ ఈ సినిమాను రీమేక్ చేయకూడదని చెప్పుకొచ్చింది. మ్యాజిక్ అనేది ఒక్కసారి క్రియేట్ అవుతుందని మళ్లీ రీమేక్ చేయలేమని మీడియాతో ముచ్చటించింది. అయితే చివరకు సమంతానే ఆ రీమేక్‌లో నటించింది.
దిల్ రాజు మదిలో..
‘96' సినిమాని రీమేక్ చేయాలనుకున్నప్పుడు దిల్ రాజులో మదిలో ఎన్ని ఆలోచనలో వచ్చినట్టున్నాయి. త్రిష పాత్ర కోసం సమంతని ముందే ఫిక్సయిపోయినట్టున్నాడు దిల్ రాజు. అయితే... విజయ్‌సేతుపతి పాత్ర కోసం మాత్రం చాలా ఆప్షన్లు రాసుకున్నాడని టాక్.
బన్నీకి చూపిస్తే..
ఆ లిస్ట్‌లో అల్లు అర్జున్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. బన్నీకి `96` సినిమాని కూడా చూపించాడట దిల్ రాజు. ఆ సినిమా నచ్చితే గనుక.. బన్నీతో లాగించేద్దామని అనుకున్నాడని తెలుస్తోంది. కానీ బన్నీ మాత్రం సినిమా చూసి ‘బాగుంది.. క్యారీ ఆన్..' అని చెప్పాడట. గానీ, ‘నేను చేస్తా' అని మాట ఇవ్వలేదని సమాచారం.
ఓకే అంటే చేద్దామనుకున్నాడట..
ఈ సినిమాని నానికి చూపిస్తే... ‘అసలు తెలుగులో ఈ సినిమా చేయొద్దు' అంటూ సలహా ఇచ్చాడట. దాంతో చివరి ఆప్షన్‌గా శర్వానంద్‌ని అనుకుని, అతనితో ఓకే చేయించుకున్నాడు దిల్ రాజు. బన్నీకి చూపించింది సలహా కోసమేనని. అయితే తనకు ఈ సినిమా విపరీతంగా నచ్చేస్తే.. చేస్తాను అని అంటే.. తనకూ హ్యాపీనే కదా, అందుకే ఓ రాయి వేశానంటూ ఆ సీక్రెట్ చెప్పేశాడు.