twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘96’ను బన్నీకి చూపించిన దిల్ రాజు.. స్టైలీష్ స్టార్ రియాక్షన్ ఏంటంటే..?

    |

    తమిళ నాట సంచలనాలు నమోదు చేసిన చిత్రం 96. త్రిష, విజయ సేతుపతి జంటగా నటించిన ఈ మూవీ ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. ఈవెంట్ ఏదైనా సరే..ఈ సినిమాకు అవార్డులు రావాల్సిందే. ఉత్తమ నటిగా త్రిష ఆ అవార్డులన్నింటిని ఎత్తుకెల్లాల్సిందే. ఆ రేంజ్‌లో మ్యాజిక్ క్రియేట్ చేశారు కాబట్టే.. మన వాళ్లు రీమేక్‌పై కన్నేశారు. ఓ సినిమాను రీమేక్ చేయాలంటే గట్స్ కావాలి. అందులోనూ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్‌ను చేయడం మామూలు విషయం కాదు.

    రీమేక్ చేయకూడదన్న సమంత..

    రీమేక్ చేయకూడదన్న సమంత..

    96 సినిమాను చూసిన సమంత.. అప్పట్లో మాట్లాడుతూ ఈ సినిమాను రీమేక్ చేయకూడదని చెప్పుకొచ్చింది. మ్యాజిక్ అనేది ఒక్కసారి క్రియేట్ అవుతుందని మళ్లీ రీమేక్ చేయలేమని మీడియాతో ముచ్చటించింది. అయితే చివరకు సమంతానే ఆ రీమేక్‌లో నటించింది.

    దిల్ రాజు మదిలో..

    దిల్ రాజు మదిలో..

    ‘96' సినిమాని రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు దిల్ రాజులో మదిలో ఎన్ని ఆలోచ‌న‌లో వచ్చినట్టున్నాయి. త్రిష పాత్ర కోసం స‌మంత‌ని ముందే ఫిక్స‌యిపోయినట్టున్నాడు దిల్ రాజు. అయితే... విజ‌య్‌సేతుప‌తి పాత్ర కోసం మాత్రం చాలా ఆప్ష‌న్లు రాసుకున్నాడని టాక్.

    బన్నీకి చూపిస్తే..

    బన్నీకి చూపిస్తే..

    ఆ లిస్ట్‌లో అల్లు అర్జున్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. బ‌న్నీకి `96` సినిమాని కూడా చూపించాడట దిల్ రాజు. ఆ సినిమా న‌చ్చితే గ‌నుక‌.. బ‌న్నీతో లాగించేద్దామ‌ని అనుకున్నాడని తెలుస్తోంది. కానీ బ‌న్నీ మాత్రం సినిమా చూసి ‘బాగుంది.. క్యారీ ఆన్‌..' అని చెప్పాడట. గానీ, ‘నేను చేస్తా' అని మాట ఇవ్వ‌లేదని సమాచారం.

    ఓకే అంటే చేద్దామనుకున్నాడట..

    ఓకే అంటే చేద్దామనుకున్నాడట..

    ఈ సినిమాని నానికి చూపిస్తే... ‘అస‌లు తెలుగులో ఈ సినిమా చేయొద్దు' అంటూ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. దాంతో చివ‌రి ఆప్ష‌న్‌గా శ‌ర్వానంద్‌ని అనుకుని, అతనితో ఓకే చేయించుకున్నాడు దిల్ రాజు. బ‌న్నీకి చూపించింది స‌ల‌హా కోస‌మేనని. అయితే తనకు ఈ సినిమా విప‌రీతంగా న‌చ్చేస్తే.. చేస్తాను అని అంటే.. తనకూ హ్యాపీనే క‌దా, అందుకే ఓ రాయి వేశానంటూ ఆ సీక్రెట్ చెప్పేశాడు.

    English summary
    Allu Arjun Reaction To Dil Raju After Watching 96 Movie. This Movie Stars Samantha And Sharwanand. And Going To Be Relaesing On 7th February.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X