Just In
- just now
రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చేయ్.. కామెడీ హీరోకు నాని సలహా
- 53 min ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 1 hr ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 1 hr ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
Don't Miss!
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- News
రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లు అర్జున్- అల్లు అరవింద్ మనీ మ్యాటర్స్.. మీడియేటర్ ఆయనే! సీక్రెట్ రివీల్
అల్లు అర్జున్ ఓ స్టార్ హీరో, అల్లు అరవింద్ ఓ స్టార్ ప్రొడ్యూసర్. ఈ ఇద్దరిదీ వేరు వేరు దారి.. అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికీ వారు చక్రం తిప్పుతూ తమ టాలెంట్ రుజువు చేసుకుంటున్నారు. తండ్రీ కొడుకులైనప్పటికీ ఈ ఇద్దరి మధ్య మనీ మ్యాటర్ మాత్రం మీడియేటర్ సహకారంతో లెక్క ప్రకారమే జరుగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలేంటో చూద్దామా..

అల.. వైకుంఠపురములో సక్సెస్.. ట్రాక్ ఎక్కిన బన్నీ
గత సినిమా 'నా పేరు సూర్య'తో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అల్లు అరవింద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో పలు మీడియా సంస్థలు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్, సినిమా లాభాలపై దృష్టి సారించాయి.

అల్లు అర్జున్ రెమ్యూనరేషన్.. హాట్ టాపిక్
ఈ నేపథ్యంలో 'అల.. వైకుంఠపురములో' సినిమాకు గాను అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? ఏ రూపంలో తీసుకున్నారు? అనే విషయమై కొన్ని రోజులుగా పలు వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అల్లు అర్జున్.. తాను 'అల.. వైకుంఠపురములో' సినిమాకు గాను తన తండ్రి నుంచి రెమ్యూనరేషన్ తీసుకున్నానని వెల్లడించారు.

సీక్రెట్ రివీల్ చేసిన బన్నీ.. ఆయనే మీడియేటర్
తన తండ్రితో రెమ్యూనరేషన్ విషయం ఎప్పుడూ డైరెక్ట్‌గా చర్చించలేదని పేర్కొన్నారు అల్లు అర్జున్. అంతేకాదు తనకు, తండ్రికి మధ్య ఈ రెమ్యూనరేషన్ విషయంలో ఓ మీడియేటర్ ఉన్నాడని చెప్పారు. ఆయనే బన్నీవాస్ అని చెబుతూ సీక్రెట్ రివీల్ చేశారు.

మనీ మ్యాటర్.. అలా ఉండదు
అంతేకాదు 'అల.. వైకుంఠపురములో' సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ విషయంలో చాలా బార్గెనింగ్ కూడా జరిగిందని అల్లు అర్జున్ చెప్పారు. మొత్తానికైతే తండ్రీ కొడుకుల మనీ మ్యాటర్ డైరెక్ట్‌గా ఉండదని చెప్పశారు మన స్టైలిష్ స్టార్.

'అల.. వైకుంఠపురములో' పూజా హెగ్డే రొమాన్స్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అల.. వైకుంఠపురములో' మూవీ బన్నీ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డే కూడా భేష్ అనిపించుకొని వరుస అవకాశాలు పట్టేస్తోంది.