Allu Arjun rejected movies: అల్లు అర్జున్ వదిలిస్తే బ్లాక్‌బస్టరేనా? ఆ సెంటిమెంట్ ఎన్టీఆర్‌కు కలిస్తుందా?

Allu Arjun rejected movies: ఇండస్ట్రీలో ఒక హీరో వదులుకున్న కథ మరో హీరోతో తెరకెక్కి భారీ విజయాన్ని అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వద్దకు వెళ్లి, ఏదో ఒక కారణంతో ఆగిపోయిన లేదా ఆయన వదిలేసిన కొన్ని ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకోవడం గమనార్హం. ఇప్పుడు అదే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు కారణం.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో రాబోతున్న ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్'.

'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ తొలుత అల్లు అర్జున్‌తో తెరకెక్కబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ సినిమా ఆగిపోయి, చివరకు అదే కాంబినేషన్ ఎన్టీఆర్‌తో సెట్ అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అల్లు అర్జున్ వదులుకున్న సినిమాలు జాబితా తెరపైకి వచ్చింది. ఈ జాబితాను పరిశీలిస్తే.. బన్నీ వదిలిన కథలు అన్ని దాదాపు బ్లాక్ బస్టర్ హిట్లే.. దీంతో అల్లు అర్జున్ వదులుకుంటే హిట్ ఖాయమే" అనే సెంటిమెంట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Allu Arjun Rejected Movies

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో సక్సెస్‌కు మరో పేరు. 'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' వంటి వరుస విజయాల తర్వాత ఇద్దరూ మరోసారి కలిసి పని చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 'పుష్ప'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం, మరోవైపు త్రివిక్రమ్ తెరకెక్కించిన 'గుంటూరు కారం' ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడం వంటి అంశాల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదనే ప్రచారం జరిగింది. అనంతరం ఈ కథ ఎన్టీఆర్‌తో 'గాడ్ ఆఫ్ వార్'గా రూపొందిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

అల్లు అర్జున్ వదిలేస్తే బ్లాక్‌బస్టరేనా?
'జయం' సినిమా మొదట అల్లు అర్జున్‌తో చేయాలనే భావించారట. కానీ, ఆ తర్వాత ఆ సినిమా నితిన్ కెరీర్‌కు పునాదిగా మారింది. ఇక 'భద్ర' కథను బోయపాటి శ్రీను ముందుగా బన్నీకి వినిపించారని చెబుతారు. అప్పటికే 'ఆర్య'లాంటి లవ్ స్టోరీ చేస్తున్న కారణంగా మాస్ కథను పక్కన పెట్టినట్లు సమాచారం. ఆ సినిమా రవితేజ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. అలాగే '100% లవ్' కథ కూడా ముందుగా బన్నీ దగ్గరకు వచ్చిందట. అయితే తాను అలాంటి సాఫ్ట్ లవ్ స్టోరీకి సూట్ కాదని భావించి, ఆయన అంగీకరించలేదని అంటారు. తర్వాత నాగచైతన్య కెరీర్ ను మార్చేసింది.

'అర్జున్ రెడ్డి' విషయానికి వస్తే.. సందీప్ రెడ్డి వంగా ఈ కథను ముందుగా పలువురు హీరోలకు వినిపించారని, అందులో అల్లు అర్జున్ కూడా ఉన్నారనే టాక్ ఉంది. చివరకు విజయ్ దేవరకొండతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమా ట్రెండ్‌ను మార్చేసింది. 'గీత గోవిందం' కూడా బన్నీ వద్దకు వెళ్లిన కథల్లో ఒకటిగా ప్రచారం. అయితే.. స్టార్ ఇమేజ్‌కు కథ సరిపోదని భావించారట. తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో బిగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక 'బొమ్మరిల్లు' కథను దర్శకుడు భాస్కర్ ముందుగా అల్లు అర్జున్‌కు వినిపించారని, డేట్స్ సమస్యల వల్ల ఆ సినిమా చేయలేకపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత సిద్ధార్థ హీరోగా వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్‌గా నిలిచింది.

'గాడ్ ఆఫ్ వార్'పై భారీ అంచనాలు
త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'గాడ్ ఆఫ్ వార్'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పుడు "అల్లు అర్జున్ వదిలిన ప్రాజెక్ట్" అనే చర్చ కూడా దీనికి మరింత హైప్ తీసుకొస్తోంది. "బన్నీ వదిలాడు కాబట్టి హిట్ అవుతుంది" అనే సెంటిమెంట్ ఎన్టీఆర్ కు కలిసివస్తుందా? లేదా? అనేది చూడాలి. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా లేదా అనేది సినిమా విడుదలైన తర్వాతే తేలనుంది.

Read more about: allu arjun ntr trivikram srinivas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X