ట్రంప్‌కే టెండర్ వేసిన విష్ణు, కాజల్.. ఇంట్రెస్టింగ్‌గా మోసగాళ్లు.. అల్లు అర్జున్ చేత టీజర్
ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై హీరో మంచు విష్ణు నిర్మించిన చిత్రం మోసగాళ్లు. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవీన్ చంద్ర, నవదీప్, కర్మ మెకైన్ నటించిన ఈ చిత్రానికి జెఫరీ గీ చిన్ దర్శకుడు. సామ్ సీఎస్ సంగీతం అందించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో ఈ టీజర్‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేశారు.
అమెరికాలో జరిగిన భారీ టెక్నికల్ సపోర్ట్ స్కామ్ ఆధారంగా మోసగాళ్లు సినిమా తెరకెక్కింది. అల్లు అర్జున్ ట్వీట్ చేసి రిలీజ్ చేసిన టీజర్.. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పీచ్‌తో ఆరంభమవుతుంది. 450 మిలియన్ డాలర్ల కుంభకోణంపై జాతిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతారు అనే మెసేజ్‌తో టీజర్ మొదలైంది.

భారీ కుంభకోణంపై కంప్యూటర్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్ యాక్ట్ ద్వారా దర్యాప్తు చేస్తామనే ట్రంప్ వ్యాఖ్యలతో టీజర్ కొనసాగుతుంది. కుంభకోణం చేసిన వారిని పట్టుకొంటాం. వారిని శిక్షిస్తాం. ఎలాంటి చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తారు. ఆ వార్నింగ్‌ను చూసి ఇది సరిపోతుందిగా అని కాజల్ అంటే... ఆట ఇప్పుడే మొదలైంది అంటూ విష్ణు మంచు చెప్పడం కనిపిస్తుంది.
మోసగాళ్లు టీజర్ ట్విట్టర్‌లో విడుదల చేస్తూ.. మోసగాళ్లు చిత్రంలోని స్కామ్ సైజ్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్ ఇది. నా బాల్య స్నేహితుడు, నా స్కూల్ మేట్ విష్ణు మంచుకు, నా ప్రియమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు బెస్ట్ విషెస్. అలాగే డైరెక్టర్, ప్రొడక్షన్‌కు నా విషెస్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











