ఎవరు టీమ్‌కు ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు.. ఉత్సాహంలో చిత్ర యూనిట్
సక్సెస్‌ఫుల్ హీరో అడవి శేష్ - కొత్త దర్శకుడు రాంజీ కలయికలో వచ్చిన చిత్రం 'ఎవరు'. రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను పీవీపీ సినిమాస్ బ్యానర్‌లో తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీతో రూపొందిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే మంచి స్పందనను రాబట్టుకుంది.
ఇందులో వచ్చే ట్విస్టులు, స్క్రీన్ ప్లే, నటీనటుల యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకు అనుగుణంగానే సినీ విమర్శకులు కూడా ఈ సినిమాకు మంచి రివ్యూలు, రేటింగ్స్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా హిట్ టాక్‌తో పాటు భారీ కలెక్షన్లనూ సాధిస్తూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 'ఎవరు'తో అడవి శేషు హ్యాట్రిక్ సాధించాడు.

ఇదిలాఉండగా, తాజాగా ఈ సినిమాను స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ చూశాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'ఎవరు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు. ఈ మూవీని ఆదివారం రాత్రి చూశాను. ఊహించని మలుపులు, ట్విస్టులలతో సాగిన అద్భుత మర్డర్ మిస్టరీ 'ఎవరు'. అడివి శేషు వరుసగా మంచి చిత్రాలను చేస్తున్నాడు. అడివిశేషుతో పాటు, రెజీనా, నవీన్ చంద్ర, మురళి శర్మ తదితర నటులు చిత్రంలో బాగా చేశారు. నిర్మాతలు పీవీపీ గారికి, అలాగే కెప్టెన్ వెంకట్ రాంజీకి శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు.
బన్నీ చేసిన ట్వీట్‌తో చిత్ర యూనిట్ ఉత్సాహం రెట్టింపైంది. అలాగే, దీనిపై చాలా మంది సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నాని చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి.


Click it and Unblock the Notifications











