అడ్డంగా దొరికిపోయిన అల్లుఅర్జున్ .. వీడియో వైరల్

ఐకాన్‌స్టార్‌గా అభిమానులతో నీరాజనాలు అందుకుంటున్నారు అల్లు అర్జున్ . పుష్పతో ఆయన రేంజ్ మారిపోయింది. ఇటీవల పాట్నాలో జరిగిన పుష్ప 2 ఆడియో లాంచ్‌కు నార్త్ ఆడియన్స్ తండోపతండాలుగా తరలివచ్చారు. దీనిని బట్టి బన్నీ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. పుష్ప ది రూల్ కోసం దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇక ఎంతటి స్టార్ హీరో అయినా సరే ఫ్రెండ్‌కి సాధారణ వ్యక్తే కదా. స్నేహానికి ప్రాణమిచ్చే అల్లు అర్జున్ కూడా స్నేహితుల కోసం ఏమైనా చేస్తారు. తాజాగా ఓ స్నేహితుడి కోసం ఆయన చేసిన ఓ పని షాక్ ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 టాక్ షో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య అడిగిన ప్రశ్నలకు బన్నీ ఆసక్తికరమైన ఆన్సర్లు ఇచ్చారు. చిరు, పవన్, మహేశ్ లాంటి స్టార్ల ఫోటోలను చూపించి వారి గురించి అభిప్రాయాలను రాబట్టారు బాలకృష్ణ. మహేశ్ అంటే అంతా ఆయన అందం గురించే మాట్లాడతారు కానీ.. ఫెయిల్యూర్స్ తర్వాత ఆయన కంబ్యాక్స్ బాగుంటాయని బన్నీ ప్రశంసించారు.

allu arjun revealed why he went to wine shop in goa at unstoppable with nbk season 4

మహేశ్ బాబుకు సినిమాలంటే పిచ్చి అని.. తన చిత్రాలతో తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ను పెంచారని.. ఆయన అంటే చాలా రెస్పెక్ట్ అని బన్నీ తెలిపారు. పవన్ కళ్యాణ్ డేరింగ్ అంటే చాలా ఇష్టమని, ఎవరెమనుకున్నా తాను అనుకున్నదే చేస్తారని నేను చూసిన డేరింగ్ లీడర్ పవన్ కళ్యాణ్ అని అల్లు అర్జున్ చెప్పారు. ప్రభాస్ ఆరడుగుల బంగారం అని ఒక్క ముక్కలో తేల్చేశారు. ఇక హీరోయిన్ల సంగతి తెచ్చిన బాలయ్య.. నీకు రష్మిక ఇష్టమా లేక పూజా హెగ్డేనా అని అడగ్గా రష్మి అన్నాడు బన్నీ.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కి సంబంధించిన ఓ వీడియో ప్లే చేయగా.. బన్నీ తల పక్కకు తిప్పి నవ్వుతూ కనిపించారు. అందులో బన్నీ ఓ వైన్ షాపులో మందు కొంటూ కనిపిస్తాడు. ఈ సంగతి ఏంటని బాలయ్య అడగ్గా.. నా పేరు సూర్య కోసం గోవా వెళ్లామని, అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ సందీప్ కూడా తనతో పాటు అక్కడికి వచ్చాడని అల్లు అర్జున్ చెప్పారు. నీకు ఏం కావాలని అడిగితే వైన్‌లో ఓ బ్రాండ్ చెప్పారని.. డ్రైవర్‌కు చెప్పి అది తీసుకురమ్మంటే వాడికి ఏం అర్ధం కాకపోవడంతో తానే కారు దిగి వైన్ షాపులోకి వెళ్లినట్లు బన్నీ తెలిపారు. తీరా షాపులో ఆ బ్రాండ్ లేకపోవడంతో వెనక్కి వచ్చేసినట్లు ఆయన వెల్లడించారు.

allu arjun revealed why he went to wine shop in goa at unstoppable with nbk season 4

దీంతో నేను వాడికి ఫోన్ చేసి తిట్టానని.. నేనొక సెలబ్రెటీని అయ్యుండి నీ కోసం నేను వెళ్లాల్సి వచ్చిందని, అదేదో నేనే తీసుకుంటానని చెప్పొచ్చుగా అని గడ్డిపెట్టినట్లు బన్నీ తెలిపారు. నీలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాల్రా అంటూ అల్లు అర్జున్ దండం పెట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తమ అభిమాన హీరో సింప్లిసిటీకి బన్నీ ఫ్యాన్స్ ముచ్చటపడిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X