క్రిస్మస్ శుభాకాంక్షలతో 'అల.. వైకుంఠపురములో' కొత్త పోస్టర్ రిలీజ్
ఈ రోజు (డిసెంబర్ 25) క్రిస్మస్ వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఈ సందర్బంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది 'అల.. వైకుంఠపురములో' టీమ్. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో.. హీరోయిన్ పూజా హెగ్డే భుజంపై చేయివేసి యమ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. దీంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ మెగా అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. షూటింగ్ ప్రారంభించిన మొదటి రోజు నుంచే 'అల.. వైకుంఠపురములో' అప్‌డేట్స్‌తో ఆకట్టుకుంది చిత్రయూనిట్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల.. వైకుంఠపురములో మూవీ. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు, సుశాంత్, నవదీప్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, నివేద పేతురాజ్, జయరాం, సత్యరాజ్, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ రికార్డులు బద్దలు కొట్టాయి. థమన్ బాణీలు క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. దీంతో అల.. వైకుంఠపురములో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. చిత్ర రన్ టైమ్ 175 నిమిషాలుగా ఉండనుందని తెలుస్తోంది. ఓ రేంజ్ అంచనాల నడుమ జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











