For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ala Vaikunthapurramloo భారీ రేటుకు హక్కులు...చక్రం తిప్పిన థమన్!

    |
    Allu Arjun's Ala Vaikunthapurramloo Pre-Release Business Details

    రాబోయే సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో'తో ఉర్రూతలూగించాలని ఫిక్స్ అయ్యాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

     త్రివిక్రమ్ మ్యాజిక్.. 'అల.. వైకుంఠపురములో' అప్‌డేట్స్

    త్రివిక్రమ్ మ్యాజిక్.. 'అల.. వైకుంఠపురములో' అప్‌డేట్స్

    'అల.. వైకుంఠపురములో' సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌తో తనదైన శైలిలో మ్యాజిక్ చేశారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఫస్ట్‌లుక్ మొదలుకొని ఇచ్చిన అన్ని అప్‌డేట్స్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు. దీంతో సంక్రాంతి రేస్‌‌‌లో 'అల.. వైకుంఠపురములో' సినిమాదే హవా అనే టాక్ స్టార్ట్ అయింది.

     థమన్ స్టైల్.. 'అల.. వైకుంఠపురములో' సాంగ్స్

    థమన్ స్టైల్.. 'అల.. వైకుంఠపురములో' సాంగ్స్

    ఇక ఈ సినిమా అప్‌డేట్స్ అన్నీ ఒకెత్తయితే.. విడుదలైన సాంగ్స్ మరో ఎత్తు అయ్యాయి. ఫస్ట్ సాంగ్ ''సామజవరగమన'' రికార్డులను తిరగరాస్తూ అందరినీ ఆకట్టుకోగా, సెకండ్ సాంగ్ ''రాములో రాములా'' ఓ ఊపు ఊపేసింది. థమన్ స్టైల్ బాణీలు క్లాస్, మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో 'అల.. వైకుంఠపురములో' హైప్ రెట్టింపయింది.

    'అల.. వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ బిజినెస్

    'అల.. వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ బిజినెస్

    దీంతో 'అల.. వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్‌లో జరిగింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయిందని తాజా సమాచారం. మొత్తం 84 కోట్ల రూపాయలతో 'అల.. వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ బిజినెస్ ముగిసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇదే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అంటున్నారు.

     చక్రం తిప్పిన థమన్.. అసలు సంగతి

    చక్రం తిప్పిన థమన్.. అసలు సంగతి

    అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్‌లో జరగడంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాత్రనే ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తోంది. థమన్ అందించిన బాణీలకు ప్రేక్షక లోకం ఫిదా కావడం కారణంగానే ఈ సినిమాకు అంచనాలను మించిన హైప్ క్రియేట్ అయిందని, అందుకే 'అల.. వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్‌లో జరిగిందని అంటున్నారు విశ్లేషకులు.

     టీజర్‌‌ సెన్సేషన్.. మెగా అభిమాని మృతి

    టీజర్‌‌ సెన్సేషన్.. మెగా అభిమాని మృతి

    మరోవైపు 'అల.. వైకుంఠపురములో' టీజర్‌‌తో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు బన్నీ. డిసెంబర్ 11న ఈ టీజర్ విడుదల చేస్తున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 9వ తేదీనే విడుదల కావాల్సిన ఈ టీజర్ మెగా అభిమాని మృతి కారణంగా రెండు రోజులు వాయిదా పడింది.

    'అల.. వైకుంఠపురములో' మూవీ

    'అల.. వైకుంఠపురములో' మూవీ

    గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    As per latest Talk Allu Arjun's Ala Vaikunthapurranuloo Pre Release Business Closed. Worldwide theatrical rights are valued at approx 84.5 Cr, Thaman the reason behind Ala Vaikunthapurramuloo huge business.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X