అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పండగే పండగ.. బన్నీ ఖాతాలో మరో రికార్డ్.. ఇదీ స్టామినా!
గత కొంత కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్న అల్లు అర్జున్.. తన లోని స్పీడ్ బయటకు తీస్తున్నారు. టాలీవుడ్ తెరపై మరోసారి తన జోష్ కనిపించేలా అడుగులేస్తున్నారు. ఈ మేరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' సినిమాకు శ్రీకారం చుట్టారు బన్నీ. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు నెలకొల్పడం చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

బన్నీ అభిమానుల్లో ఆత్రుత నెలకొల్పేలా
అల్లు అర్జున్- త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై చిత్రయూనిట్ అంతా స్పెషల్ కేర్ తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ 'అల.. వైకుంఠపురములో' స్పెషలిటీని ప్రేక్షకుల ముందుంచుతున్నారు మేకర్స్. దీంతో బన్నీ అభిమానుల్లో ఆత్రుత నెలకొంటోంది.

రికార్డుల మీద రికార్డులు
దీంతో 'అల.. వైకుంఠపురములో' మూవీ విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ 'సామజవరాగమనా' భారీ స్పందన తెచ్చుకోగా, అదే బాటలో ప్రయాణిస్తోంది రెండో సాంగ్ 'రాములో రాములా'. ఒకటి మెలోడీ, మరొకటి ఫాస్ట్ బీట్.. దేనికవే ప్రత్యేకంగా నిలుస్తూ హంగామా చేస్తున్నాయి.

చిత్రయూనిట్‌లో జోష్ నింపిన 'సామజవరగమన'
ఇటీవలే విడుదలైన 'సామజవరగమన' పాట సంచలనంగా మారి యూ ట్యూబ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రెండు రోజులు యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ.. ఎక్కువ మంది లైక్ చేసిన పాటగా రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఏ తెలుగు పాటకు రాని లైక్స్ ఈ పాట సొంతం చేసుకుంది.
రాములో రాములా.. అప్పుడే మరో రికార్డు
ఇక దీపేవి కానుకగా వచ్చిన మరో సాంగ్ 'రాములో రాములా' బీట్ బన్నీ అభిమానులను ఉర్రుతలూగిస్తోంది. మాంచి బీట్‌తో వస్తున్న ఈ సాంగ్ కి అల్లు అర్జున్ స్టెప్స్ అదరహో అనిపించాయి. దీంతో ఈ పాట 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కిన పాటగా రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్‌తో సౌత్ ఇండియా పరంగా రికార్డ్ నెలకొలిపింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

'అల.. వైకుంఠపురములో' మూవీ
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానుంది. భారీ అంచనాల నడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











