రాములో.. రాములా నన్నాగం చేసిందిరో! నా పాణం తీసిందిరో.. అల్లు అర్జున్ చించేశాడు

Recommended Video

alavaikunthapurramuloo_Ramuloo_Ramulaa_Song_Teaser

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా 'అలా.. వైకుంఠపురములో'. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ ఇది. బన్నీ గత సినిమా డిసాస్టర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ మేరకు అభిమానుల్లో ఆత్రుత నెలకొల్పేలా సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్.

'రాములో రాముల' సాంగ్.. అదరగొట్టిన బన్నీ

'రాములో రాముల' సాంగ్.. అదరగొట్టిన బన్నీ

ఇప్పటికే 'అలా.. వైకుంఠపురములో' సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో బన్నీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆ అంచనాలకు రెక్కలు కట్టేలా తాజాగా చిత్రంలో సెకండ్ లిరికల్ సాంగ్ 'రాములో రాముల' విడుదల చేశారు. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్స్, హోరెత్తిస్తున్న బీట్ బన్నీ అభిమానుల్లో కొత్త జోష్ నింపుతోంది. అలా విడుదలైందో లేదో ఇలా వైరల్ అయింది ఈ లిరికల్ సాంగ్.

నిరాశ చెందిన అభిమానులు.. చివరకు

నిరాశ చెందిన అభిమానులు.. చివరకు

నిజానికి ఈ పాటను నిన్న (సోమవారం) విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన చిత్రయూనిట్.. చివరి క్షణంలో నేటికి వాయిదా వేశారు. దీంతో ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అల్లు అర్జున్ అభిమానులు నిరాశ చెందారు. కానీ తాజాగా విడుదలైన ఈ సాంగ్ చూసి ఫిదా అవుతున్నారు. నిరాశను పక్కకు తన్ని తెగ హుషారై పోయారు బన్నీ ఫ్యాన్స్.

అల.. వైకుంఠపురములో వివరాలు

గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అల్లు అర్జున్ అంచనాలు.. ఆ కారణం గానే!

అల్లు అర్జున్ అంచనాలు.. ఆ కారణం గానే!

బన్నీ గత చిత్రం డిసాస్టర్ కావడంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ కావాలని అల్లు అర్జున్ అంచనాలు పెట్టుకున్నారు. ఆ కారణంగానే అటు త్రివిక్రమ్, ఇటు అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అదే రోజు మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కూడా విడుదల అకానుండటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X