'అల.. వైకుంఠపురములో' ఫినిష్.. అఫీషియల్ స్టేట్‌మెంట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రాబోతున్న 'అల.. వైకుంఠపురములో' షూటింగ్ అయింది. గత కొన్ని నెలలుగా రేయింబవళ్లు షూటింగ్ షూటింగ్ జరుపుతూ బిజీగా బిజీగా గడిపిన చిత్రయూనిట్ కాస్త రిలాక్స్ కాబోతోంది. చివరి షెడ్యూల్ షూటింగ్‌లో బన్నీ, పూజా హెగ్డేతో పాటు మరికొందరు కీలక నటులు పాల్గొన్నారు. అయితే 'అల.. వైకుంఠపురములో' షూటింగ్ ఫినిష్ చేసి గుమ్మడికాయ కొట్టేసినట్లుగా అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది చిత్రయూనిట్.
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'అల.. వైకుంఠపురములో' సినిమా విడుదల కానుంది. తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రయూనిట్ ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ అవుట్‌ఫుట్ కోసం ప్రత్యేక శ్రద్ద పెట్టనున్నారు త్రివిక్రమ్, అల్లు అర్జున్.

'అల.. వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ సరసన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో ఈ సినిమా రూపొందింది. చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్లు తెలిసింది. థమన్ అందించిన బాణీలకు ఫిదా అయిపోయింది ప్రేక్షకలోకం.


Click it and Unblock the Notifications











