'అల.. వైకుంఠపురములో': పోటీ పడదామనుకున్న అల్లు అర్జున్.. చివరకు వెనకడుగు.. కొత్త డేట్ ఫిక్స్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న కొత్త 'అల.. వైకుంఠపురములో'. బన్నీ కెరీర్ లోనే స్పెషల్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేస్తుండగా, ఊహించని పరిణామం చోటు చేసుకోవడం.. దాంతో పోటీ పడదామనుకున్న అల్లు అర్జున్ వెనకడుగేయడం జరిగాయి. ఆ వివరాలు చూద్దామా..

హైప్ క్రియేట్ అయింది కానీ.. వాయిదా వేయక తప్పలేదు
అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ కావడంతో 'అల.. వైకుంఠపురములో' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మేరకు ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ.. హైప్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. ఇక టీజర్‌తో మరోసారి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమైన తరుణంలో అకస్మాత్తుగా ఈ టీజర్ రిలీజ్‌ను వాయిదా వేయక తప్పలేదు.

అభిమాని ఆకస్మిక మృతి.. మెగా హీరోలంతా
గ్రేటర్ హైద్రాబాద్ చిరంజీవి యూత్ గ్రూప్ లీడర్, మెగా ఫ్యాన్ అయిన నూర్ మహ్మద్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఈ రోజు (డిసెంబర్ 9) విడుదల కావాల్సిన టీజర్ వాయిదా వేశారు. మెగా అభిమానులు నూర్ మహ్మద్ మరణం పట్ల సంతాపం తెలిపారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు మెగా హీరోలు సైతం నూర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

నూర్ మరణం.. వెంటనే వాయిదా
ఈ నేపథ్యంలో.. నూర్ లాంటి అభిమాని మరణంతో కుటుంబంలోని ఓ వ్యక్తిని కోల్పోయినట్లు అనిపిస్తోందని, ఇలాంటి సమయంలో ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వదలుచుకోలేదని ప్రకటించింది గీతా ఆర్ట్స్. త్వరలోనే టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్ డిసెంబర్ 9వ తేదీ ఉదయం పది గంటలకు ప్రకటిస్తామని ప్రకటించింది.
అభిమాని కోసం వెనక్కి తగ్గారు.. దానికి మాత్రం రెడీ
ఇక తాజాగా 'అల.. వైకుంఠపురములో' టీజర్‌ని డిసెంబర్ 11న విడుదల చేస్తున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ని గీత ఆర్ట్స్ సంస్థ రీ ట్వీట్ చేసింది. మొత్తానికి ఇలా అనుకోని కారణంగా, మెగా అభిమానులను సంతోషపెట్టేలా కాస్త వెనక్కి తగ్గి టీజర్ ద్వారా మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు అల్లు అర్జున్.
Recommended Video

'అల.. వైకుంఠపురములో' మూవీ
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో'. ఈ మూవీలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.


Click it and Unblock the Notifications











