twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ లుక్ రిలీజ్.. యమ స్టైల్‌గా బన్నీ

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. బన్నీ కెరీర్‌లో 'నా పేరు సూర్య' డిసాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూపొందిస్తున్నారు. ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది.

    వావ్ యమ స్టైల్.. బొమ్మ అదిరింది

    వావ్ యమ స్టైల్.. బొమ్మ అదిరింది

    అల్లు అర్జున్ అలా కూర్చోని ఉండగా సెక్యూరిటీ గార్డ్ సిగరెట్ వెలిగిస్తుండటం ఈ లుక్‌ లో గమనించవచ్చు. చూడటానికి చాలా అట్రాక్ట్ చేస్తూ చాలా స్టైలిష్ గా ఉన్న ఈ పోస్టర్ నెట్టింట ఇట్టే వైరల్ అయింది. బొమ్మ అదిరింది అంటూ ఈ పోస్టర్ పై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

    అల్లు అర్జున్ డిఫెరెంట్ షేడ్స్‌

    అల్లు అర్జున్ డిఫెరెంట్ షేడ్స్‌

    ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడని, ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడనే వార్త ప్రచారంలో ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    సీనియర్ హీరోయిన్ టబు రీ ఎంట్రీ

    సీనియర్ హీరోయిన్ టబు రీ ఎంట్రీ

    ‘అల.. వైకుంఠపురములో' సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఒకప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కీర్తించబడిన టబు గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. త్రివిక్రమ్ కోరిక మేరకు ఈ సినిమాలో నటించేందుకు టబు ఓకే చేసిందని సమాచారం. చిత్రంలో జయరాంకి జోడీగా టబు నటిస్తోంది.

    అల.. వైకుంఠపురములో మూవీ

    అల.. వైకుంఠపురములో మూవీ

    గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతోంది ‘అల.. వైకుంఠపురములో' సినిమా. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    English summary
    Allu Arjun and trivikram new movie title fixed. This movie will release on january 2020. Now this movie Fisrt look poster released and getting huze responce from the audians.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X