బన్నీ ఊరమాస్.. త్రివిక్రమ్, అల్లు అర్జున్ 'అలా..' ఫిక్సయ్యారు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'అల.. వైకుంఠపురములో'. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అల్లు అర్జున్ గత సినిమా 'నా పేరు సూర్య' డిసాస్టర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు బన్నీ. మరోవైపు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇచ్చే విధంగా అన్ని హంగులతో తన కథకు తెర రూపమిస్తున్నారట. దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే వీరిద్దరి కాంబోపై, 'అల.. వైకుంఠపురములో' పై అంచనాలు హై రేంజ్‌కి వెళ్లిపోయాయి.

ఈ అంచనాలకు రెక్కలు కట్టేలా ఎప్పటికపుడు 'అల.. వైకుంఠపురములో' అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆత్రుత నింపుతున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, లిరికల్ సాంగ్ తెచ్చుకుంటున్న ఆదరణ చూసి ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమని ఫిక్స్ అయ్యారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
అందరూ భావించినట్లు గానీ ఈ సంక్రాంతికే బన్నీ బరిలోకి దిగుతున్నాడని ప్రకటించారు. జనవరి 12వ తేదీన అల.. వైకుంఠపురములో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో బన్నీ ఊరమాస్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. కళ్లకు కూలింగ్ క్లాస్, చంకలో పందెంకోడి, చేతిలో కత్తి, నోటిలో బీడీ, తలకు రుమాళ్ చుట్టి అలా నడిచి వస్తున్నట్లుగా కనిపిస్తూ ఆయన అభిమానులకు మూడు నెలల ముందుగానే సంక్రాంతి పండుగ తెచ్చేశాడు. గతంలో ఎన్నడూ లేనంత డిఫెరెంట్‌గా ఉన్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.


Click it and Unblock the Notifications











