గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది.. అల వైకుంఠపురములో పేలిన ‘అల్లు’, త్రివిక్రమ్ మాటల తూటా
స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు 'త్రివిక్రమ్' శ్రీనివాస్ ల కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్', 'గీతాఆర్ట్స్' కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పేరును 'అల వైకుంఠపురములో'. గా నిర్ణయించారు.దీనికి సంబంధించిన వీడియోను ఈరోజు ఉదయం విడుదలచేశారు. హీరోగా అల్లు అర్జున్‌కు ఇది 19 వ చిత్రం కాగా, అల్లు అర్జున్,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూడో చిత్రం. 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్ర విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై సినీ, ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షక వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్, 'గీతాఆర్ట్స్' అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
సాధారణంగా త్రివిక్రమ్ చిత్రాల టైటిల్స్ కి క్రేజ్ బాగా ఎక్కువ. అలాంటిది అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎలాంటి టైటిల్ పెట్టనున్నారా అనే ఆసక్తి బాగా పెరిగింది. అందరి అంచనాలకు మించిన మంచి టైటిల్ కుదరడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉన్నారు. సినిమా కథకు సరిగ్గా సరిపోవడం... అల్లు అర్జున్ ఇమేజ్ కు ఏమాత్రం తీసిపోని ఈ టైటిల్ తో సినిమాకు మరింత బజ్ పెరిగింది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర టైటిల్ కూడా ఫెస్టివల్ మూడ్‌కు సరిగ్గా సరిపోవడం కలిసి వచ్చే మరో అంశం.

అల వైకుంఠపురములో టైటిల్‌ను ప్రకటించడంతోపాటు ఫస్ట్ గ్లింప్స్ వీడియోను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చివరిలో గ్యాప్ బాగా వచ్చిందే అంటే అల్లు అర్జున్ చెప్పిన గ్యాప్ ఇవ్వలా .. వచ్చింది అనే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ డైలాగ్‌కు అల్లు అర్జున్ అభిమానుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది.
ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చేలా ఉంటాయి. అల్లు అర్జున్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి, త్రివిక్రమ్ మాటల తూటాలు కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లోని కామెడీనే ఇందుకు ఉదాహరణ. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్ సిద్దమవుతున్నది.
నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
సినిమాటోగ్రఫి: పిఎస్ వినోద్,
సంగీతం: థమన్ ఎస్,
ఎడిటర్: నవీన్ నూలి:
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్


Click it and Unblock the Notifications











