HBD Varun Tej అల్లు అర్జున్ ఎమోషనల్ బర్త్ డే విషెస్.. బన్నీకి పోస్టుకు..
మెగా హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తన 32వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జనవరి 19వ తేదీన ఆయన బర్త్ డే కావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు అందించారు. తన కజిన్ వరుణ్ తేజ్ బర్త్ డే రోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్‌గా పోస్టు పెట్టారు. వరుణ్ తేజ్‌కు ఇన్స్‌టాగ్రామ్‌లో అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ అందజేస్తూ..
వరుణ్ తేజ్ నీవు నీవుగా ఎదిగిన తీరు చూసి గర్వపడుతున్నాను. భవిష్యత్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకొంటున్నాను. నీకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వచ్చే సంవత్సరం నీకు అంతా శుభం కలుగాలని కోరుకొంటున్నాను అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు.

అల్లు అర్జున్ పోస్టుకు వరుణ్ తేజ్ స్పందిస్తూ థ్యాంక్స్ తెలిపారు. బర్త్ డే విషెష్ తెలియజేసినందుకు థ్యాంక్స్ బన్నీ అన్న అంటూ వరుణ్ తేజ్ సమాధానం ఇచ్చారు.
అలాగే వరుణ్ తేజ్‌కు తండ్రి, నటుడు నాగబాబు కూడా భావోద్వేగంతో కూడిన విషెస్ అందజేశారు. ప్రతీ తండ్రికి నీలాంటి కొడుకు ఉంటే.. జీవితం పరిపూర్ణమవుతుంది. మా కలలను సాకారం చేసిన నీకు మాటల్లో చెప్పలేం. మమ్మల్ని తల్లిదండ్రులగా ఎంచుకొన్నందుకు, మా జీవితాలను అద్భుతంగా మార్చినందుకు థ్యాంక్స్, హ్యాపీ బర్త్ డే వరుణ్ తేజ్ అంటూ తండ్రి నాగబాబు ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్‌లో పోస్టు పెట్టి చిన్ననాటి ఫోటోలను షేర్ చేశాడు.
ఇక వరుణ్ తేజ్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. గని అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఆయన నటించిన F3 చిత్రం కూడా రిలీజ్‌కు ముస్తాబైంది. త్వరలోనే గని, F3 చిత్రాలతో అభిమానులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











