నువ్వు నా జీవితంలోకి వచ్చాకే ప్రేమంటే ఏంటో అర్థమైంది.. అల్లు అర్జున్ భావోద్వేగం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో ఎంత సరదాగా ఉంటారో తెలిసిందే. ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతోనే గడిపే అల్లు అర్జున్.. కరోనా కారణంగా హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ భార్యాబిడ్డలతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా తన కొడుకు అల్లు అయాన్ ఫోటో షేర్ చేస్తూ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు బన్నీ. వివరాల్లోకి పోతే..

అల్లు అయాన్ పుట్టినరోజు
నేడు (ఏప్రిల్ 3) అల్లు అర్జున్ కుమారుడు అయాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన బన్నీ.. కుమారునిపై ఉన్న ప్రేమకు తెలుపుతూ ట్వీట్ చేశారు. తండ్రి ప్రేమ తెలియజేసేలా భావోద్వేగంతో కూడిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇన్నాళ్లు ఆలోచించా.. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక!
కొడుకు అయాన్ ఫోటో షేర్ చేసిన అల్లు అర్జున్.. ''ప్రేమ అంటే ఏంటని ఇన్నాళ్లు ఆలోచించా. గతంలో చాలా సార్లు ప్రేమ అంటే ఇదేనేమో అని అనుకున్నా కూడా. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రేమ అంటే ఏంటో నాకు అర్థమైంది. ప్రేమ అంటే నువ్వే. ఐ లవ్యూ అయాన్. హ్యాపీ బర్త్ డే మై బేబీ'' అని పేర్కొన్నారు.
'అల.. వైకుంఠపురములో' జోష్
ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' రూపంలో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ మాంచి జోష్ లో ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ మూవీతో 2020కి కిక్ స్టార్ట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
Recommended Video

అల్లు అర్జున్- రష్మిక మందన్న రొమాన్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న వైవిద్యభరితమైన కథాంశం అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











