ఎన్టీఆర్ బాటలో కాదు.. మామ పవన్ బాటలో బన్నీ.. ల్యాండ్ వెనుక అసలు సంగతి ఇదట!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు రోజులుగా మీడియాలో ఎక్కువ హైలెట్ అయ్యారు. దానికి కారణం ఆయన హైదరాబాద్ శివార్లలో ఉన్న శంకర్పల్లి ప్రాంతంలో రెండు ఎకరాల భూమి కొనుగోలు చేయడమే.. సరిగ్గా కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ అక్కడే ఆరున్నర ఎకరాలు కొనడంతో అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ నే ఫాలో అవుతున్నాడని అక్కడ పొలం మీద పెట్టుబడి పెట్టి ఉంటారని అందరూ భావించారు. అయితే దీని వెనుక అసలు విషయం వేరే ఉంది అని తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే

పుష్పతో బిజీబిజీ
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఒక డీ గ్లామర్ రోల్ లో కనిపిస్తున్నాడు. పుష్ప రాజు అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం చిత్తూరు యాస కూడా నేర్చుకుని చాలా కష్టపడ్డాడు..

సోషల్ మీడియాలో హల్చల్
పూర్తిగా శేషాచలం అడవుల ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే సరిగ్గా రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ హైదరాబాద్ శివార్లలో శంకర్పల్లి మండలంలో జనవాడ గ్రామ పరిధిలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.. ఈ భూమి కొనుగోలు నిమిత్తం ఆయన శంకర్పల్లి తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడ అభిమానులు చుట్టుముట్టి ఆయన తో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం మీడియా దాకా వెళ్ళింది.

మామ పవన్ ను ఫాలో అవుతూ
సరిగ్గా అదే ఆఫీసులో ఎన్టీఆర్ సుమారు 4 నెలల క్రితం ఆరున్నర ఎకరాల భూమి కోసం వెళ్లడంతో ఎన్టీఆర్ ను అల్లు అర్జున్ ఫాలో అవుతున్నారు అని ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ రెండు ఎకరాల భూమి కొన్నది భూమి మీద పెట్టుబడి పెట్టడానికి కాదని ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఉద్దేశంతో ఈ భూమి కొన్నారని తెలుస్తోంది. ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెడుతున్నారు.

మార్చేసిన పుష్ప
అయితే అందరికంటే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫాం హౌస్ లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, నిర్మాత సురేష్ బాబు, హీరోయిన్ సమంత లాంటి వాళ్లు కూడా ఈ పద్ధతి ఫాలో అయ్యారు. పుష్ప సినిమా షూటింగ్ లో భాగంగా ఎక్కువ శాతం అడవిలో గడిపిన అల్లు అర్జున్ హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగల్ లో కాకుండా తనకంటూ కాస్త ప్రకృతికి దగ్గరగా ఉండేలా ఏదైనా ప్రాపర్టీ ఉంటే బాగుండని భావించాడని అంటున్నారు.

ఇప్పటికే పనులు మొదలు
అందుకే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కోసం ఫామ్ హౌస్ ఒకదానిని హైదరాబాద్ శివార్లలో నిర్మించుకోవడానికి ఈ రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమీ లేదు కానీ అల్లు అర్జున్ అయితే ఇప్పటికే ఆర్గానిక్ ఫార్మింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











