అప్పుడది ఇప్పుడిది.. అల్లు అర్జున్ హంగామా మామూలుగా లేదే!
యంగ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సెన్సషన్స్ మామూలుగా లేవే! అంటూ ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. గత సినిమా 'నా పేరు సూర్య' డిసాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు సంచలనాలకు మారు పేరుగా తయారయ్యాడు. తన తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' సినిమాతో రికార్డులకు బ్రేక్ చేస్తూ టాలీవుడ్ కింగ్ అవుతున్నాడు.
'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదలైన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకలోకాన్ని, ముఖ్యంగా మెగా అభిమానులను అబ్బురపరిచాయి. పోస్టర్స్, సాంగ్స్ నానా హంగామా చేశాయి. ఈ నేపథ్యంలోనే 'అల.. వైకుంఠపురములో' మొదటి పాట ''సామజవరగమన'' సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. టాలీవుడ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 1 మిలియన్ లైక్స్ పొందింది.

ఇక అదే బాటలో 'అల.. వైకుంఠపురములో' రెండవ పాట ''రాములో రాముల'' కూడా పయనిస్తుండటం మెగా శిబిరాల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఈ సాంగ్ ఇప్పటికే 72 మిలియన్ వ్యూస్ రాబట్టడమే గాక, 7 లక్షల లైకులు పొంది.. టాలీవుడ్‌లో అత్యధిక లైక్స్ పొందిన రెండో పాటగా రికార్డ్ నమోదు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. సో.. విడుదలకు ముందే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉందంటే ఇక 'అల.. వైకుంఠపురములో' సినిమా విడుదల తర్వాత ఆ సంచలనాలు ఊహించడం కష్టమే మరి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. టబు కీలక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











