ఆన్‌లైన్‌లో అల్లువారబ్బాయి హంగామా.. కోటి దాటేశాడు
ఆన్‌లైన్‌లో అల్లువారబ్బాయి హంగామా మామూలుగా లేదు. నెట్టింట హల్చల్ చేస్తూ శరవేగంగా దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ఆయన తాజా సినిమా అల.. వైకుంఠపురములో సినిమా నుంచి ఇటీవలే 'సామజవరగమన' సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ మెలోడీ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది.
విడుదలైన 24 గంటల్లోనే 60 లక్షలకు పైగా వ్యూస్, 3 లక్షల లైక్స్ రాబట్టిన ఈ సాంగ్.. ఇప్పటి వరకు కోటి వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. సిరివెన్నెల సాహిత్యంపై థమన్ అందించిన బాణీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ఇంత వేగంగా ఇన్ని వ్యూస్ రాబట్టిన లిరికల్ వీడియో సాంగ్ మరోటి లేదని టాక్ నడుస్తోంది.

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ మొదలుపెట్టిన అల.. వైకుంఠపురములో యూనిట్.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్‌లుక్, లిరికల్ సాంగ్ తెచ్చుకుంటున్న ఆదరణ చూస్తుంటే ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం అని తెలుస్తోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











