Pushpa 2: నార్త్‌లో పుష్పగాడి రూల్.. ఐపీఎల్‌ను మించిన క్రేజ్‌తో అల్లు అర్జున్ మాస్ రికార్డ్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ల కాంబోలో వచ్చిన పుష్ప 2 అనేక రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.1780 కోట్లకు పైగా వసూళ్లతో భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో టాప్ 3లో నిలిచింది. తెలుగు, తమిళ, హిందీ, ఓవర్సీస్ మార్కెట్‌లో పుష్ప 2 సరికొత్త రికార్డులు సృష్టించింది. అల్లు అర్జున్ దెబ్బకు హిందీ ఇండస్ట్రీ షేక్ అయ్యింది. స్ట్రెయిట్ హిందీ సినిమాలను మించి పుష్ప 2 అక్కడ వసూళ్లను సృష్టించింది. తాజాగా పుష్ప 2 ది రూల్ మరో చరిత్ర సృష్టించింది ఈ వివరాల్లోకి వెళితే..
7 రాష్ట్రాల్లో నెంబర్ 1గా
తెలుగు, ఇతర దక్షిణాది భాషల కంటే నార్త్ ఆడియన్స్ పుష్ప 2కు బ్రహ్మరథం పట్టారు. దేశంలోని 28 రాష్ట్రాలలో 7 రాష్ట్రాలలో పుష్ప 2 హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. బీహార్, గోవా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పుష్ప 2 అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. హిందీ బెల్ట్‌లోనీ కీలక రాష్ట్రాలు కావడం కలిసిరావడం వల్లే పుష్ఫ 2కు ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయని విశ్లేషకులు తెలిపారు. ఈ రికార్డును బ్రేక్ చేయగల చిత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు.

రీలోడెడ్ వెర్షన్‌తో ఓటీటీలోకి
థియేట్రికల్ రన్ ముగించుకుని ఓటీటీలోకి వచ్చినప్పుడు కూడా పుష్ప 2 ఇక్కడా తన హవా చూపించాడు. 20 నిమిషాల ఎక్స్‌ట్రా రీ లోడెడ్ వెర్షన్‌తో కలిపి జనవరి 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పుష్ప 2 ది రూల్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కట్ చేస్తే కేవలం 24 గంటల వ్యవధిలోనే నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లోకి పుష్ప 2 దూసుకొచ్చింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ మార్చేసింది.
పాకిస్తాన్‌లోనూ టాప్ ట్రెండింగ్
ఇండియాలోనే కాదు ఆ సమయంలో ఏకంగా 21 దేశాల్లో పుష్ప టాప్ 2లో ట్రెండ్ అయ్యింది. మన దాయాది దేశం పాకిస్తాన్‌లోనూ పుష్పగాడు టాప్‌లో ఉండటం గమనార్హం. అలా పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అన్న డైలాగ్ నిజమైంది. ఓటీటీలో ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 బుల్లితెరపైనా దానిని కంటిన్యూ చేశాడు. తెలుగులో స్టార్ మాలో ప్రీమియర్ అయిన ఈ సినిమా ఆ సమయంలో మాస్ హిస్టరీ క్రియేట్ చేసింది. తాజాగా హిందీలోనూ పుష్పగాడు తన మేనియా ఏమాత్రం తగ్గేలేదని ప్రూవ్ చేశాడు.
ఐపీఎల్‌ను దాటేసిన పుష్ప2
మే 31న జీ ఛానెల్‌లో ప్రపంచవ్యాప్తంగా హిందీలో ప్రీమియర్‌గా పుష్ప 2ను టెలికాస్ట్ చేశారు. తాజాగా విడుదలైన బార్క్ గణాంకాల ప్రకారం.. హిందీ ప్రీమియర్‌లోనూ పుష్ప 2 సంచలనం నమోదు చేసింది. ఏకంగా 5.1 టీఆర్పీ సాధించడంతో పాటు 5.4 కోట్ల మంది ప్రేక్షకులు హిందీ ప్రీమియర్‌ను వీక్షించారు. థియేటర్‌లో, ఓటీటీలలో ఆల్రెడీ చూసినప్పటికీ టీవీలోనూ ఈ స్థాయిలో ఆదరణ దక్కడం ఓ సంచలనమని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వచ్చిన రేటింగ్ కంటే కూడా ఇది ఎక్కువ. ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్‌కు 4.6 టీఆర్పీ మాత్రమే వచ్చింది. దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను మించిన క్రేజ్‌తో అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. తద్వారా హిందీలో తన మార్కెట్‌ను అల్లు అర్జున్ మరింత పెంచుకున్నట్లయ్యింది.


Click it and Unblock the Notifications











