For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్: అరుదైన ఘనతను అందుకున్న పుష్పరాజ్

  |

  యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప నటుల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పేరుకు బడా ప్రొడ్యూసర్ కొడుకే అయినా.. తన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ అల్లు హీరో.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' అనే చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్.

  Bigg Boss Telugu 5 Nominations: ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఆరుగురు.. టైటిల్ ఫేవరెట్‌ కూడా నామినేట్

  భారీ సక్సెస్‌తో మాంచి ఊపులో ఉన్న అల్లు అర్జున్.. ఆ వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్‌తో కలిసి 'పుష్ప' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. అందులో మొదటి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తవగా.. రెండో భాగం చిత్రీకరణ కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు కూడా ఈ సినిమా షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసేసి.. క్రిస్టమస్‌ కానుకగా 'పుష్ప.. ద రైజ్'ను విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

  Allu Arjuns Pushpa Daakko Daakko Meka Song Reach 1 Million Likes

  'పుష్ప' మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీని నుంచి ఇటీవలే మొదటి పాట 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుతుంది పీక'ను విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను విశాల్ దద్లానీ (హిందీ), విజయ్ ప్రకాశ్ (కన్నడ), రాహుల్ నంబియార్ 'మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాల్ (తమిళం)లు పాడారు. విడుదలైన అన్ని భాషల్లోనూ దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సాంగ్ సెన్సేషన్ అయిపోయింది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

  అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్‌ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!

  'పుష్ప' సినిమా నుంచి విడుదలైన 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుతుంది పీక' పాటు ఇప్పటికే దాదాపు 35 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఇది ఒక మిలియన్ లైకుల మైలురాయిని చేరుకుంది. దీంతో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అదే సమయంలో టాలీవుడ్‌లో ఎక్కువ పాటలకు ఒక మిలియన్.. అంతకంటే ఎక్కువ లైకులను అందుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ అదిరిపోయే రికార్డును అందుకున్నాడు. గతంలో అతడికి సంబంధించిన పలు పాటలు ఈ మార్కును చేరుకున్న విషయం తెలిసిందే.

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం అతడు ఎన్నో సాహసాలు సైతం చేస్తున్నాడు. అలాగే డీ గ్లామర్ లుక్‌తో కనిపిస్తున్నాడు. సామాన్య లారీ డ్రైవర్ నల్లమల ప్రాంతంలో డాన్‌గా ఎలా ఎదిగాడు అన్న కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.

  English summary
  Tollywood Star Hero Allu Arjun Doing Pushpa Under Creative Director Sukumar Direction. Now This Movie Daakko Daakko Meka Song Reach 1 Million Likes in Youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X