Making Of Pushpa: పుష్ప నుంచి మరో సర్‌ప్రైజ్.. వామ్మో సినిమా వెనుక ఇంత జరిగిందా!
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీ స్టామినా భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో కొంత కాలంగా మన దగ్గర భారీ నుంచి అతి భారీ చిత్రాలు వస్తున్నాయి. ఫలితంగా మన హీరోలు కూడా మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ సినిమాపై ఆది నుంచే భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000కు పైగా థియేటర్లలో విడుదల చేశారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పుష్ప' మూవీ గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం ప్రేక్షకుల రాకతో కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో' అని అంటున్నారు. అలాగే, ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు, దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ హైలైట్‌గా ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వచ్చిన 'పుష్ప' మూవీ ప్రతి రోజూ ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. దీంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజింగ్ వీడియోను విడుదల చేశారు. అదే పుష్ప మేకింగ్ వీడియో. సెట్స్‌లో ఉన్న సందడి.. షూటింగ్ కోసం అందరూ పడిన కష్టాలు.. చిత్రీకరణ గ్యాప్‌లో హీరో, హీరోయిన్లు వ్యవహరించే తీరు ఇలా ఎన్నో రకాల విజువల్స్‌ను ఇందులో చూపించారు. అంతేకాదు, అల్లు అర్జున్‌తో కూతురు అర్హ ఆడుకుంటోన్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో కనిపించాయి. మొత్తానికి దీన్ని కూడా మజాను పంచేలానే డిజైన్ చేశారు.
భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పుష్ప' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా వారం రోజుల్లోనే రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్‌ను కూడా దాటేసింది. శుక్రవారం వరకూ చూసుకుంటే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి తొమ్మిది రోజులకు రూ. 73.05 కోట్లు షేర్‌ను రాబట్టింది. అలాగే, కన్నడం, మలయాళం, తమిళం, హిందీ భాషలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఇది భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 123.73 కోట్లు వచ్చాయి. తద్వారా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు మరింత దగ్గరగా వచ్చింది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్‌గా నటించాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేశాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించారు. అలాగే, సమంత స్పెషల్ సాంగ్ చేసింది.


Click it and Unblock the Notifications











