Pushpa Deleted Scene: సినిమాలో కట్ చేసిన సీన్ రిలీజ్.. బన్నీ మేనరిజం హైలైట్
గత ఏడాది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకుని ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ స్టైలిష్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి 'పుష్ప' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించారు. ఆరంభం నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ. 145 కోట్ల మేర జరిగినట్లు ఫిలిం నగర్‌లోని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పుష్ప' మూవీని రెండు వారాల క్రితమే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం ప్రేక్షకుల రాకతో సందడిగా కనిపించాయి. ఇక, ఈ సినిమాలో అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో'తో అదరగొట్టేశాడు. అలాగే, ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు, దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ హైలైట్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సుకుమార్ పనితనం కూడా మెప్పించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది.

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వచ్చిన 'పుష్ప' మూవీకి రిలీజ్ రోజు నుంచి మంచి స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. తెలుగులో మాత్రమే కాదు.. తమిళం, కన్నడం, మలయాళం, మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు విశేషమైన వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా రెండు వారాలు ముగిసే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 139.70 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 6.30 వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంటుంది. అదే జరిగితే బన్నీ ఖాతాలో మరో భారీ విజయం వచ్చినట్లు అవుతుంది.
'పుష్ప' మూవీ నుంచి నుంచి తరచూ ఏదో ఒక సర్‌ప్రైజింగ్ వీడియోను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఆ తర్వాత 'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే సాంగ్ వీడియోను కూడా వదిలారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి డిలీట్ చేసిన ఓ సీన్‌ను యూట్యూబ్‌లో వదిలారు. ఇందులో అప్పు తీర్చమని పుష్ప ఇంటికి వచ్చిన వ్యక్తి.. అందరి ముందే నోటికొచ్చినట్లు మాట్లాడి పరువు తీస్తాడు. ఆ తర్వాత అతడి డబ్బు తిరిగి ఇచ్చేసిన పుష్ప.. అందరి ముందే అతడిని కొడతాడు. ఇందులో బన్నీ మేనరిజం హైలైట్‌గా ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్‌గా నటించాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించారు. అలాగే, స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











