Pushpa Part 2 Title: పుష్ప రెండో భాగానికి అదిరిపోయే టైటిల్.. రూల్ చేయడానికి రెడీ

తెలుగు సినిమా స్థాయి పెరిగిన తర్వాత మన పరిశ్రమకు చెందిన హీరోల్లో ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు భారీ ప్రాజెక్టులను చేస్తున్నారు. ఇలా వస్తున్న భారీ సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' ఒకటి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000కు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పుష్ప' మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో' అని అంటున్నారు. అలాగే, ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు, దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ హైలైట్‌గా ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Allu Arjuns Pushpa Part 2 Title Revealed

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు 'పుష్ప ది రైజ్' పేరిట మొదటి పార్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మరికొన్ని రోజుల గ్యాప్ తర్వాత రెండో భాగాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఇక, ఈ పార్ట్‌కు సంబంధించి చాలా వరకూ షూటింగ్ పూర్తి అయినట్లు కూడా తెలుస్తోంది. మిగిలిన భాగం చిత్రీకరించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ కూడా చేసుకున్నాడు. ఇక, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలెట్టి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయబోతున్నారు.

భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పుష్ప' మూవీ ఫస్ట్ పార్ట్‌కు 'ది రైజ్' అనే టైటిల్‌ను యాడ్ చేయడంతో.. త్వరలోనే రాబోయే రెండో భాగానికి ఎలాంటి పేరు పెడతారా అని చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన మొదటి భాగంలో రెండో పార్ట్‌కు సంబంధించిన పేరును రివీల్ చేశారు. దీనికి 'పుష్ప ది రూల్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ పార్ట్‌లో పుష్పరాజ్ ఎలా ఎదిగాడు అన్నది చూపించగా.. రెండో దానిలో స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఎలా రూల్ చేశాడు అన్నదాన్ని హైలైట్ చేయబోతున్నట్లు ఈ టైటిల్ చూస్తే అర్థం అవుతోంది. దీంతో దీనిపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌ పుష్ప రాజ్‌గా నటించాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేశాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్ ఇందులో కీలక పాత్రలను పోషించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X