‘పుష్ప’ నుంచి అదిరిపోయే వీడియో: పరిచయం చేస్తున్నట్లు మరో గుడ్ న్యూస్ చెప్పిన టీమ్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో ఈ మూవీ రాబోతుంది. అందుకే దీనిపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలు దృష్టి సారించాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా నుంచి శుక్రవారం అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. 'ప్రిల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్' పేరిట శనివారం ఉదయం ఓ వీడియోను వదలబోతున్నట్లు చిత్ర యూనిట్ అందులో పేర్కొన్న విషయం తెలిసిందే.
ముందుగా ప్రకటించిన ప్రకారం.. 'పుష్ప' మూవీ నుంచి 'ప్రిల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్' వీడియో ఉదయం 11 గంటలకు విడుదలైంది. ఇందులో అల్లు అర్జున్ మాంచి మాస్ లుక్‌తో దర్శనమిచ్చాడు. అతడి ముఖాన్ని కవర్ చేసి ఉంచడంతో పాటు చేతులను వెనక్కి కట్టేసి చూపించారు. దీంతో అతడు ఎక్కడి నుంచో పారిపోయి వస్తున్నట్లు వీడియోను రూపొందించారు. ఇక, ఇందులో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అలాగే, విజువల్స్ కూడా ఎంతో గ్రాండ్‌గా ఉన్నాయి. ఫలితంగా ఈ 'ప్రిల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్' వీడియోకు మంచి స్పందన వస్తోంది.

ఇక, ఇదే వీడియోలో ఏప్రిల్ 7, సాయంత్రం 6.12 గంటలకు పుష్ప రాజ్‌ను పరిచయం చేయబోతున్నట్లు ఓ గుడ్ న్యూస్‌ను కూడా చెప్పింది చిత్ర యూనిట్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకునే టీజర్‌ను వదలబోతున్నారు. ఈ అప్‌డేట్లపై మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











