Pushpa Party In Tirupati: ఒక్క సినిమాతో ప్యాన్ ఇండియా విలన్ అయ్యా.. సునీల్ ఎమోషనల్
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సంచలన విజయం దిశగా పరుగులు పెడుతున్నది. డిసెంబర్ 17వ తేదీన రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఏపీలో ఈ చిత్రం 60 కోట్లు నికరంగా, 90 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 94.44 కోట్లు నికరంగా, 162 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ సినిమా సక్సెస్ పార్టీని నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలో సునీల్ మాట్లాడుతూ..
అందాల రాముడు సినిమాలో హీరోగా నటించినపుడు నా జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది.. ఇప్పుడు పుష్ప చిత్రంతో విలన్‌గా కూడా ఇక్కడి నుంచే మొదలైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్లే అంతా జరిగింది. తెలుగులో మాత్రమే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా అదే వైబ్రేషన్ రావడం పుష్ప సినిమా స్పెషల్‌గా మారింది. పుష్ప సినిమాతో అన్ని భాషల్లో విలన్ అయిపోయాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుక్కు డార్లింగ్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక భాషలో కాదు అన్ని భాషల్లో ఒకేసారి గుర్తు తెచ్చుకో అంటూ బన్నీ గారు నన్ను విసిరి కొట్టేసారు. నన్ను సీరియస్ పాత్రలో కూడా చూసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. పుష్ప సినిమా ఇంకా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని సునీల్ తెలిపారు.

ఫుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రలో అద్భుతంగా సునీల్ నటించిన విషయం తెలిసిందే. అనసూయతో కలిసి ఈ సినిమాలో కొత్తగా హావభావాలు చూపించారు. విలన్‌గా మంచి బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నారనే విషయాన్ని సినీ, ప్రేక్షక వర్గాలు స్పష్టం చేశాయి.


Click it and Unblock the Notifications











