మరోసారి అదే పని చేసిన ‘పుష్ప’ టీమ్: సినిమా ఆలస్యం అవుతుందా అని అనుమానం

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ అన్నింటికీ మించి స్టైల్స్‌లో వైవిధ్యాన్ని చూపిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాదు.. మలయాళంలో సైతం ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాడు. అదే సమయంలో ఉత్తరాది ప్రేక్షకులకు సైతం తన డబ్బింగ్ చిత్రాల ద్వారా చేరువయ్యాడు. ఇలా చాలా కాలంగా హవాను చూపిస్తున్నాడు.

గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల.. వైకుంఠపురములో' అనే చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన ఉత్సాహంతోనే ఆ వెంటనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి 'పుష్ప' అనే సినిమాను ప్రారంభించాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ విషయం చిత్ర యూనిట్ రకరకాల ప్లాన్లతో ముందుకు సాగుతోంది.

 Allu Arjuns Pushpa Team Went Rampachodavaram for Shoot

పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు మొదటి దాని కోసం షూట్ చేస్తున్నారు. ఇక, మొదటి భాగాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట వచ్చే క్రిస్టమస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వాస్తవానికి 'పుష్ప' మూవీకి సంబంధించిన షూటింగ్ నల్లమల అటవీ ప్రాంతంలో జరపాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, దానికి పర్మీషన్ రాకపోవడంతో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఓ భారీ షెడ్యూల్‌ను జరిపారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఈ మూవీ యూనిట్ మరోసారి అక్కడికి వెళ్లిందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ను తీయబోతున్నారని అంటున్నారు. 'పుష్ప' టీమ్ మళ్లీ పాత ప్లేస్‌కే వెళ్లడంతో సినిమాను రీషూట్ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.

'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. లారీ డ్రైవర్ స్థాయి నుంచి డాన్‌గా ఎలా ఎదిగాడన్న నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ పాత్ర కోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రను పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X