తూర్పు మన్యానికి అల్లు అర్జున్ టీమ్: ఈ సారి అక్కడ పుష్పరాజ్ మాస్ జాతరే
'అల.. వైకుంఠపురములో' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'పుష్ప'. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇటీవలే మరో షెడ్యూల్‌ను కూడా హైదరాబాద్‌లో ప్రారంభించారు. రెండు భాగాలుగా విడుదల కాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 'పుష్ప' మూవీ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ ఫిలిం నగర్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
చిత్తూరు ప్రాంతానికి సంబంధించిన కథతో 'పుష్ప' మూవీ తెరకెక్కుతోంది. దీంతో నల్లమల అడవుల్లో షూటింగ్ చేయాలని భావించారు. కానీ, అక్కడ పర్మీషన్ దొరకలేదు. దీంతో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో చాలా సీన్స్‌ను చిత్రీకరించారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో షూటింగ్‌ను జరుపుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పుష్ప మూవీ యూనిట్ మరోసారి రంపచోడవరం పయనం కాబోతుందట. అంతేకాదు, అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేయబోతున్నారని తెలిసింది. దాదాపు ఇది నెల రోజుల పాటు జరగనుందని అంటున్నారు. అయితే, ఈ షెడ్యూల్ ఏ పార్ట్‌కు సంబంధించిందో మాత్రం క్లారిటీ రాలేదు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప'లో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్‌గా నటిస్తున్నాడు. ఇందులో అతడు లారీ డ్రైవర్ పాత్రను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











