twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పుష్ప’ టీజర్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: అలా ప్లాన్ చేస్తున్న టీమ్.. అన్ని కట్ చేస్తున్నారట

    |

    గత ఏడాది మాటల మాంత్రికుడు తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ ఫలితం ఇచ్చిన జోష్‌లోనే వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్‌తో 'పుష్ప' అనే సినిమాను ప్రారంభించేశాడు. పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ మూవీ టీజర్‌ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

    'పుష్ప' మూవీ షూటింగ్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల కాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమా టీజర్ కటింగ్‌ను ప్రారంభించిందట చిత్ర యూనిట్. ఇంకో విషయం ఏమిటంటే.. ఈ వీడియో కూడా అన్ని భాషల్లో విడివిడిగా రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. ముందుగా సుకుమార్ టీజర్ కటింగ్‌ చేస్తాడని.. ఆ తర్వాత అది బన్నీకి నచ్చితేనే ఫైనల్ చేస్తారని సమాచారం. రెండు మూడు వారాల పాటు షూటింగ్‌తో పాటు టీజర్ పనులు జరుగుతాయనే టాక్ వినిపిస్తోంది.

     Allu Arjuns Pushpa Teaser Update

    అల్లు అర్జున్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న 'పుష్ప'ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటించనున్న అతడు.. లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే, చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. డీ గ్లామర్‌గా ఉండే ఈ రోల్ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు కూడా. ఇక, ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Pushpa is an upcoming Indian Telugu-language action thriller film written and directed by Sukumar with Allu Arjun, Vijay Sethupathi, Rashmika Mandanna, Prakash Raj and Jagapati Babu in lead roles, while Harish Uthaman, Vennela Kishore and Anasuya Bharadwaj in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X