Pushpa Movie Censor: అల్లు అర్జున్ మూవీకి ఆ సర్టిఫికెట్.. టోటల్ రన్ టైం ఎంతో తెలిస్తే!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలంతా పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు భారీ ప్రాజెక్టులను చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఎన్నో పెద్ద సినిమాలు పట్టాలపై ఉన్నాయి. మరికొన్ని మూవీలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న 'పుష్ప' ఒకటి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'పుష్ప' చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతుంది. దీంతో దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ భాగానికి సంబంధించిన దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే రెండో పార్ట్‌ కోసం చిత్రీకరణ మెదలు పెట్టి మరింత వేగంగా షూట్ జరుపుతున్నారు. అది కూడా చాలా వరకూ పూర్తైంది.

Allu Arjuns Pushpa The Rise Movie Censor and Run Time Details Out

క్రేజీ కాంబోలో వస్తున్న 'పుష్ప.. ద రైజ్'ను డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఎప్పుడో ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే చాలా రోజుల క్రితం టీజర్‌ను విడుదల చేశారు. ఇది ఆల్‌టైం రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే, ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన వీడియోలు, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అదే సమయంలో అంచనాలు కూడా ఊహించని రీతిలో పెరిగాయి.

మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'పుష్ప ద రైజ్' సెన్సార్ రిపోర్టు గురించి తాజాగా కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ యూనిట్ సభ్యులు దీనికి యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌‌ను జారీ చేశారని తెలిసింది. అంతేకాదు, ఈ సినిమా రన్ టైం 2 గంటల 59 నిమిషాలు ఉంటుందని కూడా ఓ న్యూస్ లీకైంది. కొంత నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమా మాత్రం అదిరిపోయేలా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌ పుష్ప రాజ్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్ ఇందులో కీలక పాత్రలను పోషిస్తోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X