Pushpa Release Date: సర్‌ప్రైజ్ చేసిన పుష్పరాజ్.. చెప్పిన దాని కంటే ముందుగానే వైల్డుగా!

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో హిట్లను అందుకున్నా.. గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో కెరీర్‌లోనే తొలిసారి ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'పుష్ప' అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మూవీ యూనిట్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

‘పుష్ప' మూవీతో రెడీ అవుతోన్న బన్నీ

‘పుష్ప' మూవీతో రెడీ అవుతోన్న బన్నీ

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది.

పుష్పరాజ్‌గా మారేందుకు సాహసాలతో

పుష్పరాజ్‌గా మారేందుకు సాహసాలతో

'పుష్ప' మూవీ గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఘాటీ రోడ్‌లో లారీ డ్రైవింగ్ నేర్చుకోవడం.. డీ గ్లామర్‌గా కనిపించడం.. చిత్తూరు యాసలో మాట్లాడడంతో పాటు రియల్ స్టంట్స్ చేస్తున్నాడు.

రెండు భాగాలుగా పుష్ప.. షూట్ అప్‌డేట్

రెండు భాగాలుగా పుష్ప.. షూట్ అప్‌డేట్

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక, ఇప్పటికే మొదటి భాగానికి 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు బ్యాలెన్స్ పార్ట్ షూట్ చేస్తున్నారు.

అప్పుడే రికార్డులు.. దేశ వ్యాప్తంగా హవా

అప్పుడే రికార్డులు.. దేశ వ్యాప్తంగా హవా

పుష్ప మూవీ నుంచి ఆ మధ్య 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఇటీవలే 'దాక్కో దాక్కో మేక' పాటను వదలగా ఇది దేశ వ్యాప్తంగా ఆదరణ అందుకుని అంచనాలు పెంచేసింది.

 అందరినీ సర్‌ప్రైజ్ చేసిన పుష్ప టీమ్

అందరినీ సర్‌ప్రైజ్ చేసిన పుష్ప టీమ్

ఇటీవలి కాలంలో తెలుగులో తెరకెక్కుతోన్న చాలా భారీ చిత్రాలు విడుదల తేదీలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే 'పుష్ప ద రైజ్'ను క్రిస్టమస్ కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, ఇది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'పుష్ప' టీమ్ రిలీజ్ డేట్‌తో సర్‌ప్రైజ్ చేసేసింది.

చెప్పిన దాని కంటే ముందుగానే వైల్డుగా!

చెప్పిన దాని కంటే ముందుగానే వైల్డుగా!

తాజాగా 'పుష్ప' మూవీ యూనిట్ మొదటి భాగానికి సంబంధించిన రిలీజ్ డేట్‌పై ప్రకటన చేసింది. 'పుష్ప ద రైజ్'ను డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది యూనిట్. అంతేకాదు, 'ఈ డిసెంబర్‌లో పుష్పరాజ్ రాకతో థియేటర్లు అన్నీ వైల్డుగా మారబోతున్నాయని' అని ట్వీట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X