Raaka: ఐపీఎల్‌‌లో అల్లు అర్జున్ మేనియా... రాకా స్టైల్‌తో స్టార్ క్రికెటర్ హల్‌చల్

భారతదేశంలో సినిమా, క్రికెట్‌కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తారలను, క్రికెటర్లను అభిమానులు దేవుళ్ల మాదిరిగా కొలుస్తారు. అయితే క్రికెటర్లకు కూడా అభిమాన హీరోలున్నారు.. అలాగే హీరోలకు కూడా అభిమాన క్రికెటర్లు ఉన్నారు. ఈ ట్రెండ్ కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతోంది. అయితే అభిమాన తారల గెటప్స్‌తో గ్రౌండ్‌లో హల్‌చల్ చేసిన సందర్భాలున్నాయి. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026)లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ట్రెండ్ హల్‌చల్ చేస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

పుష్ప సిరీస్ తర్వాత ఐకాన్‌స్టార్‌గా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించారు అల్లు అర్జున్. దాంతో ఆయన తదుపరి సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్టీ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్ 8వ తేదీన ఈ మూవీ టైటిల్, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. అదే రాకా.. గుండుతో.. కత్తుల్లాంటి గోళ్లతో వైల్డ్‌గా కనిపిస్తున్న అల్లు అర్జున్ భయపెడుతున్నాడు. దాంతో రాకాపై అంచనాలు పెరిగిపోయాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Allu Arjun s Raaka Mania Hits IPL 2026 Hardik Pandya s Viral Gesture Steals the Show

ఇదిలాఉండగా.. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్డిక్ పాండ్యా ప్రస్తుతం.. ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. గ్రౌండ్‌లో ఎంతో జోష్‌తో ఉంటూ తన లుక్, గెటప్‌తో అభిమానులను అలరిస్తుంటారు పాండ్యా. బ్యాట్‌తో ఊచకోత కోసే పాండ్యా.. తన హావభావాలతో ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. గతంలో మైదానంలో పాండ్యా విన్యాసాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తను చేయడంతో పాటు తోటి క్రికెటర్లతోనూ ఇమిటేట్ చేయిస్తూ నవ్వులు పూయిస్తాడు.

తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏప్రిల్ 12న ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ హార్డిక్ పాండ్యా లుక్, మేనరిజం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. పాండ్యా హావభావాలు.. అల్లు అర్జున్- అట్లీల రాకా సినిమాలో బన్నీ గెటప్ తాలూకా మేనరిజం కనిపించింది. రాకా టైటిల్‌ రిలీజ్‌కు ముందు ఓ భయంకరమైన చేయి, పొడవైన గోళ్లతో ఎవరినో పిలుస్తున్నట్లుగా కనిపించే పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఇప్పుడు అచ్చం అలాగే చేతి వేళ్లు పెట్టి గ్రౌండ్‌లో హల్‌చల్ చేశాడు పాండ్యా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సినీ, క్రికెట్ రంగాల మధ్య ఇది అద్భుతమైన కలయికగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే రాకాపై ఉన్న అంచనాలను హార్డిక్ పాండ్యా మరింత పెంచేశారని అల్లు అర్జున్ అభిమానులు చెబుతున్నారు. ఇదంతా రాకా మేనియా అంటూ వారు సంబరపడిపోతున్నారు.

మరోవైపు.. ఈ వీడియోపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. కేవలం దీనిని అతిగా ఊహించుకోవడమేనని తేల్చేస్తున్నారు. హార్డిక్ పాండ్యా చేసిన ఆ సైగ.. క్రికెట్ ప్రపంచంలో చాలా సాధారణమని చెబుతున్నారు. ఈ సినిమా మేనరిజంతో తమ సినిమాకు సంబంధం ఉందని రాకా యూనిట్ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే పుష్ప సినిమా సమయంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన విన్యాసాలు, తగ్గేదే లే అంటూ చేసిన మేనరిజం మాత్రం సినీ, క్రీడా వర్గాల్లో వైరల్ అయ్యింది. కానీ రాకాకు సంబంధించి అలాంటి ట్రెండ్ ఇంకా మొదలు కాలేదు. కాబట్టి పాండ్యా సైగలు యాధృచ్చికమే తప్పించి.. కావాలని చేసింది కాదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై రాకా యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more about: allu arjun Raaka hardik pandya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X