AA25: అల్లు అర్జున్‌తో సందీప్ రెడ్డి వంగా మూవీ.. లీక్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన కష్టం, ప్రతిభతో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు. లవర్ బాయ్‌గా, స్టైలీష్ స్టార్‌గా జేజేలు అందుకుంటున్న ఆయనను పుష్ప మూవీ పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా దెబ్బతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా మారిపోయారు. తెలుగు రాష్ట్రాలు, కేరళలో బన్నీని అభిమానించేవారు కోట్లలో ఉన్నారు. ఇప్పుడు పుష్ప దెబ్బకు ఆయన క్రేజ్ ఎవరెస్ట్‌ను తాకింది. నార్త్ ఇండియాలోనూ బన్నీకి బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

అల్లు అర్జున్ లైనప్
పుష్పతో వచ్చిన క్రేజ్‌ని నిలబెట్టుకోవడానికి అల్లు అర్జున్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని కథల ఎంపిక, దర్శకులను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది చివరినాటికి లేదా.. 2027లో అట్లీ - అల్లు అర్జున్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Allu Arjun Sandeep Reddy Vanga Movie Bhushan Kumar confirmation on Icon Star s 25th Movie

లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్
అట్లీతో సినిమా పూర్తయిన వెంటనే మరో తమిళ స్టార్ డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్‌తో మూవీకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కూలీ తర్వాత లోకేష్ టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ రేంజ్‌లో ఈ సినిమాను తీర్చిదిద్దుతానని లోకేష్ ఇప్పటికే హిట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఇది ఒక సూపర్ హీరో మూవీగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో మూవీ కోసం లోకేష్ ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేశారు. అట్లీ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ అయిన వెంటనే బన్నీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటారు.

క్యూలో ప్రశాంత్ నీల్, సుకుమార్
ఈ సినిమా తర్వాత కూడా తన లైనప్‌ను అల్లు అర్జున్ సెట్ చేసి పెట్టుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో పాన్ ఇండియాను వణికించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ వెంటనే సుకుమార్‌తో బన్నీ పుష్ప 3ని పట్టాలెక్కిస్తారని టాక్. ఇక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయాలన్నది అల్లు అర్జున్ కల... ఇందుకోసం ఎప్పటి నుంచో బన్నీ వెయిట్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో వారణాసి కంప్లీట్ చేసిన తర్వాత బన్నీతో రాజమౌళి సినిమా చేస్తాడని టాలీవుడ్ వర్గాల్లో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ సినిమా
ఇదిలాఉండగా... లోకేష్ కనగరాజ్‌తో మూవీ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ చేయబోయే దర్శకుడిపై అధికారికంగా ఓ హింట్ వచ్చేసింది. అది ఎవరో కాదు... సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్‌ సినిమాలతో దేశాన్ని ఊపేశారు సందీప్. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరోలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నారు సందీప్. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్‌తో సందీప్ వంగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ విషయాన్ని టీ సిరిస్ అధినేత భూషణ్ కుమార్ వెల్లడించారు.

అల్లు అర్జున్ 25వ సినిమా
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా తన టీ సిరీస్ బ్యానర్‌లో తీయనున్న సినిమాల లైనప్ గురించి భూషణ్ మాట్లాడారు. ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ చేస్తుండగా.. అది ముగిసిన వెంటనే రణబీర్ కపూర్‌తో యానిమల్ 2 తెరకెక్కించనున్నారు. ఆ వెంటనే అల్లు అర్జున్‌ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తమ బ్యానర్‌లో ఓ సినిమా వస్తుందని భూషణ్ కుమార్ పేర్కొన్నారు. ఇది బన్నీ కెరీర్‌లో 25వ సినిమా అని ఆయన చెప్పారు. అంటే అట్లీతో 22వ సినిమా, లోకేష్‌తో 23వ సినిమా, సుకుమార్‌‌తో 24వ సినిమా చేయనున్నారు అల్లు అర్జున్. దాంతో సందీప్‌ దర్శకత్వంలో తన కెరీర్‌లోనే మైల్‌స్టోన్ అనదగ్గ 25వ సినిమాలో బన్నీ నటించనున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X