Allu Arjun: ఇదే అతి పెద్ద విజయం .. అల్లు అర్జున్ ఎమోషన్..

Pushpa 2 Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 ది రూల్' నేడు డిసెంబర్ 5 విడుదల అయింది. ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా స్క్రీన్ లలో ఈ సినిమా ప్రదర్శించబడుతుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మోస్ట్ అవైటెడ్ భారీ బడ్జెట్ మూవీ కి ఎనలేని రెస్పాన్స్ వస్తుంది. అలాగే.. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్లు కొల్లకొడుతుందని, నయా రికార్డులను క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే?

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప పార్ట్ 1 సినిమాతో అభిమానులను ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతకుమించి అనేలా పుష్ప2 కు ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందానాలు నటిస్తున్నారు ఈ సినిమా గురువారం నేడు గ్రాండ్ గా విడుదలైంది .

Allu Arjun shares his son Ayaan s handwritten note ahead of Pushpa 2 release

ఈ సినిమాలో ప్రధానంగా అల్లు అర్జున్ తన నటనతో దుమ్మురేపాడు. తన నటన మాస్ ఎలివేషన్.. అలాగే జాతర ఎపిసోడ్లో ఎమోషనల్ సీన్స్ పాటలు డాన్సులు ఇలా ఎన్నో పుష్ప 2 ను గ్రాండ్ సక్సెస్ వైపుగా తీసుకెళుతున్నాయి. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడు తమ పాత్రలలో ఒదిగిపోయారు. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులనే కాదు ఫ్యాన్ ఇండియా ప్రేక్షులలో ప్రేక్షకుల మదిలో కూడా చెరుగని వేసుకున్నారు.

అలాగే.. పుష్ప 2 సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్యూబా కెమెరా పనితనం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్పటు మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్తుంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇంతకీ పోస్ట్ ఏంటి ఆ పోస్టు ఎవరు పెట్టారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

Allu Arjun shares his son Ayaan s handwritten note ahead of Pushpa 2 release

పుష్ప 2 సినిమా విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్.. ఓ లెటర్ రూపంలో ఉన్న స్వీట్ నోటును అల్లు అర్జున్ షేర్ చేశారు ఇందులో 'నాన్న నిన్ను..ఈ సక్సెస్ ను చూస్తూ ఉంటే నాకెంతో గర్వంగా ఉంది. నిన్ను సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు నాకు చాలా చాలా స్పెషల్. ప్రపంచంలోనే ఓ గొప్ప నటుడి సినిమా విడుదల అవుతుంది. నువ్వు ఎప్పుడు నా హీరో వే.. నాన్ననీకున్న ఎంతోమంది ఫాన్స్ లలో నేనొక ఫ్యాన్' అంటూ అల్లు అయాన్ రాసుకోచ్చాడు.

ప్రస్తుతం ఈ లెటర్ ను అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. ఇప్పటివరకు సాధించిన విజయాలలో ఇది అతి పెద్ద విజయం అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి ప్రేమను పొందడం తన అదృష్టం అని క్యాప్షన్ కూటా ట్టారు.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 aayaan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X