శిల్పాశెట్టిని పట్టించుకోని బన్నీ.. వారు మాత్రం హార్ట్‌ను టచ్ చేశారట.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్
అల వైకుంఠపురుములో చిత్రం ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో.. అందులోని పాటలు అంతకంటే సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా విడుదలై నెల రోజులు కావొస్తున్నా.. కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. మరోవైపు సినిమాల్లోని పాటల క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో, టిక్ టాక్‌లో వైరల్ అవుతున్న వీడియోలే దీనికి నిదర్శనం.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న పాటలు..
అల వైకుంఠపురములో సినిమాపై అంతటి బజ్ క్రియేట్ కావడానికి ముఖ్య కారణం తమన్ అందించిన సంగీతమే. ఒక్కో పాటను అలా విడుదల చేసుకుంటూ పోతే.. యూట్యూబ్‌కు కంటిమీద కునుకులేకుండా పోయింది. సామజవరగమన, రాములో రాములో, ఓ మై గాడ్ డాడీ, బుట్టబొమ్మ ఇలా ఒక్కో పాట సోషల్ మీడియాలో పెను సంచలనమే రేపింది.

టిక్‌టాక్‌లో పిచ్చి క్రేజ్..
టిక్ టాక్ యాప్ గురించి.. టిక్ టాక్ సెలెబ్రిటీల గురించి తెలియని వారెవరూ ఉండరు. వింత వింత చేష్టలతో కొందరు ఫేమస్ అవుతుంటే.. తమలోని ప్రతిభను ప్రదర్శించి మరికొందరు ఫేమస్ అవుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టు పాటలకు వీడియోలు క్రియేట్ చేసి, హీరో హీరోయిన్ల స్టెప్పులు, డైలాగ్‌లు చెబుతూ హల్ చల్ చేస్తుంటారు.
కానరాని శిల్పా శెట్టి స్టెప్పులు..
ఇప్పుడు టిక్ టాక్ ప్రపంచాన్ని బుట్టబొమ్మ పట్టేసింది. ఏ ఏజ్ వాళ్లు చూసినా ఆ పాటకే స్టెప్పులేసి నడుమును తెగ తిప్పేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి, ఆమె సోదరి షమితా శెట్టి (పిలిస్తే పలుకుతా ఫేమ్) ఇద్దరు కలిసి బుట్టబొమ్మ స్టెప్పులు వేశారు. ఇది నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది.
Recommended Video

ఇది నా హార్ట్‌ను టచ్ చేసింది..
అంతగా ట్రెండ్ అయిన వీడియో మాత్రం బన్నీ కంట పడలేదు కానీ, ఓ ఇద్దరు దివ్యాంగులు కలిసి చేసిన వీడియో మాత్రం బన్నీ హృదయాన్ని తాకింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ.. ‘బుట్టబొమ్మపై ఎన్నో వీడియోలు చూశాను కానీ ఇది మాత్రం నా హార్ట్‌ను టచ్ చేసింది. సంగీతమనేది మన హద్దులన్నీ చెరిపేస్తుంది.. ఈ వీడియో చూశాక నాకు చాలా సంతోషంగా ఉంద'ని అన్నాడు.


Click it and Unblock the Notifications











