అల్లు అర్జున్‌కు యాక్సిడెంట్.. అదే పెద్ద గిఫ్ట్ అంటున్న బన్నీ.. అసలేం జరిగిందంటే?
ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి రాజమౌళి బ్రాండ్ లేకుండా పాన్ ఇండియా రికార్డులు బ్రేక్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని చెప్పవచ్చు. ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ తన అభిమానులకి ఎక్కడ లేని హైప్ ని అందించి ప్రైడ్ హీరోగా నిలిచాడు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇపుడు అభిమానులుగా మారిన వారు కోసం ఏమో కానీ తనని మొదటి నుంచి ఫాలో అయ్యేవారికి మాత్రమే తన అసలు సత్తా ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది.
మీరెప్పుడైనా గమనించారా? బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ఇపుడు 50 ఏళ్ళు దాటినా కూడా మంచి డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టేస్తూ ఉంటాడు. కానీ ఎందుకు ఇపుడు అల్లు అర్జున్ అంతకు మించిన డాన్సర్ అయ్యి ఉండి కూడా ఇపుడు ఇలాంటి చేయడం లేదు అని? నిజానికి అసలు అల్లు అర్జున్ కి ఫాలోయింగ్ మొదలైందే తన డాన్స్ లు అప్పట్లో తన జిమ్నాస్టిక్ మూమెంట్స్ ని చూసి.

తన బాడీని పాము మెలికలు తిప్పినట్టు ఎలా పడితే అలా మెలికలు తిప్పేసే అల్లు అర్జున్ ఒక టైం తర్వాత డాన్స్ లు ఆపేసాడు. అలాగే టాలీవుడ్ కి 6 ప్యాక్ బాడీ సాలిడ్ ఫిట్నెస్ లని పరిచయం చేసిన అల్లు అర్జున్ ఫైట్స్ కూడా అంత రిస్కీగా తీసుకోవడం లేదు. ఇవన్నీ ఎప్పుడైతే పక్కన పెట్టాడో అక్కడే తన కల్ట్ ఫ్యాన్స్ కి కొంచెం డౌట్స్ మొదలయ్యాయి.
అయితే అసలు తాను ఎందుకు ఇలాంటి వాటి నుంచి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందో రివీల్ చేసాడు. కాగా అల్లు అర్జున్ కి కొన్నాళ్ల కితం అయ్యిన యాక్సిడెంట్ కోసం షాకింగ్ నిజాన్ని తాను బయట పెట్టాడు. తనకి పెళ్ళైన కొత్తలో అలాగే అంతకు ముందు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడిని అని చెప్పాడు. కానీ ఒక్కసారి తనకి జరిగిన యాక్సిడెంట్ తర్వాత తన లైఫ్ మొత్తం మారిపోయింది అని చెప్పాడు.
కాగా తనకి రెస్ట్ తర్వాత మళ్ళీ మొదటిలా అన్నీ చూసేద్దామా అనుకుంటే అవి తనకి వీలు పడలేదు అని చెప్పుకొచ్చాడు. అప్పుడు ఒక వయసుకి వచ్చాక ఒంట్లో సత్తువ తగ్గుతుంది అనేది గమనించాను అక్కడ నుంచి తన ఫిజికల్ ఫిట్నెస్ పై కాకుండా నటనపై ఎక్కువ దృష్టి పెట్టాను అని అసలు విషయం తెలిపాడు.
అలా నటుడిగా పరిణితి ఆ యాక్సిడెంట్ తర్వాతే వచ్చింది అని ఆ యాక్సిడెంట్ తన లైఫ్ లో ఒక గిఫ్ట్ లాంటిది అని బన్నీ చెప్పడం ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. కాగా అల్లు అర్జున్ ఇవన్నీ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సెట్ చేసిన వేవ్స్ సమితిలో చెప్పడం జరిగింది. ఇలా తన లైఫ్ కి చెందిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.


Click it and Unblock the Notifications











